ETV Bharat / city

సోయా కష్టం.. పత్తికి నష్టం.. రైతన్నకు ఆర్థిక భారం తప్పదా..? - పొలాస వ్యవసాయ పరిశోధన కేంద్రం

అధిక వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటల్లో కొన్ని తిరిగి కోలుకోవడం కష్టంగా మారింది. సోయా, మొక్కజొన్న, పత్తి పైర్ల మొక్కలు మొలిచి 20 నుంచి 25 రోజులే అయినందున లేతదశలో ఉన్నవి వరదలకు తట్టుకోలేవని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనంలో గుర్తించింది. అయితే మళ్లీ విత్తనాలు లేదా నాట్లు వేయడం తమకు ఆర్థికభారంగా మారిందని రైతులు శాస్త్రవేత్తలకు చెబుతున్నారు.

Soya crop
Soya crop
author img

By

Published : Jul 17, 2022, 9:18 AM IST

ఉత్తర తెలంగాణను వరదలు ముంచెత్తడంతో.. పంటలు నీట మునిగాయి. వర్షాలకు దెబ్బతిన్న పంటల్లో కొన్ని తిరిగి కోలుకోవడం కష్టంగా మారింది. సోయా, మొక్కజొన్న, పత్తి పైర్ల మొక్కలు మొలిచి 20 నుంచి 25 రోజులే అయినందున లేతదశలో ఉన్నవి వరదలకు తట్టుకోలేవని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనంలో గుర్తించింది. ‘‘ఎక్కువ రోజులు నీళ్లలో మునిగి ఉన్న ఈ పైర్ల మొక్కలు పలు ప్రాంతాల్లో చనిపోతున్నాయి. లేతదశలో ఉన్న సోయా, మొక్కజొన్న మొక్కలు అధిక తేమకు ఏమాత్రం తట్టుకోలేవని’’ వర్సిటీ రైతులకు ఇచ్చిన తాజా సూచనల్లో తెలిపింది. ఈ చేలను దున్నేసి మళ్లీ అవే విత్తనాలు లేదా మినుము, పెసర, ఆముదం వంటి ఇతర పంటలు వేసుకోవాలని సూచించింది. అయితే మళ్లీ విత్తనాలు లేదా నాట్లు వేయడం తమకు ఆర్థికభారంగా మారిందని రైతులు శాస్త్రవేత్తలకు చెబుతున్నారు. ‘‘వానాకాలం సీజన్‌ గత నెలలో మొదలైనందున వరి తప్ప మిగతా పంటల సాగుకు పెద్దగా సమయం లేదు. పత్తి ఈ నెల 20 వరకూ, ఆముదం, సజ్జలు, కొర్రలు, మొక్కజొన్న వంటివి ఈ నెలాఖరు వరకే విత్తుకోవడానికి సమయముంది. సోయా చిక్కుడు పంట దెబ్బతింటే దానిస్థానంలో మళ్లీ అదే పంట విత్తనాలు నాటుకోవాలనుకుంటే వెంటనే వేయాలి, లేకపోతే దానిని వదిలేయాలి’’అని రైతులకు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

.

విత్తనాల ధరలను ప్రైవేటు కంపెనీలు పెంచేయడంతో రైతులకు ఆర్థికభారం బాగా పెరిగింది. గతేడాది సోయా విత్తనాలు క్వింటా రూ.9 వేలకు అమ్మిన ప్రైవేటు కంపెనీలు ఈ సీజన్‌లో రూ.13 వేల నుంచి 14 వేలకు విక్రయిస్తున్నాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద ఈ విత్తనాలు లేవని, ప్రైవేటు వ్యాపారుల వద్దనే కొని నాటుకోవాలని వ్యవసాయశాఖ సూచించడంతో కంపెనీలు ధరలు పెంచేశాయి. గోదావరి వరదతో కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లోని వందలాది గ్రామాల్లో వరద 5 నుంచి 10 అడుగుల మేర ఎత్తుతో పొలాలను ముంచేసింది. దాంతో మరో పంట విత్తుకోవాల్సిందేనని రైతులు అంటున్నారు. కొన్నిచోట్ల చెరువులు, వాగులకు గండ్లుపడి పైర్లు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయి ఇసుక, బురద మేటలు వేశాయి. జయశంకర్‌ వర్సిటీకి చెందిన పొలాస గ్రామంలోని ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు జగిత్యాల జిల్లాలో పలు గ్రామాలకు వెళ్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించి వర్సిటీకి నివేదించారు. నిజామాబాద్‌ జిల్లా పడకల్‌లో పెద్దచెరువు తెగి ఇలాగే 150 ఎకరాల్లో ఇసుకమేట వేసి పంటలు కనిపించకుండా పోయాయి. ఇలాంటి చోట్ల ఇసుక, బురద తొలగించడానికే చాలా ఖర్చవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.