కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా విధించిన జనతా కర్ఫ్యూకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, ఆర్టీసీ, సింగరేణి సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.
రహదారులన్నీ నిర్మానుష్యం
ప్రధాని మోదీ ఒక్క పిలుపుతో మహా యాగంలా కరోనాపై యుద్ధం సాగుతోంది. నిత్యం రద్దీగా ఉండే... హైదరాబాద్ వెస్ట్‌జోన్, పంజాగుట్ట సర్కిల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
మేము సైతం
రైతు బజార్ల నుంచి మొదలై... ప్రజా దవాఖాన, ప్రజా రవాణా వరకు అన్ని స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి.
చెప్పినా వినరే
జనతా కర్ఫ్యూపై ప్రజలకు.. మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాప్రతినిధులు, పోలీసులు, ప్రముఖులు ఎంత అవగాహన కల్పించినా.. కొంత మంది రహదారులపై తిరుగుతున్నారు. వారిని నిలువరించిన పోలీసులు ఇంటికి వెళ్లాలని సూచిస్తున్నారు.
ఇళ్లలోనే ఉండండి
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై అవగాహన కల్పించారు. ప్రజలంతా ఇంటి వద్దే ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు.
- ఇదీ చూడండి : భారత్‌లోని ప్రధాన నగరాల్లో జనతా కర్ఫ్యూ ఇలా...