ETV Bharat / city

'వైకాపాతోనే నా ప్రయాణం'... జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు - వైసీపీపై రాపాక కామెంట్స్

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ఆ పార్టీపై విరుచుకున్న పడ్డారు. జనసేన గాలికి వచ్చిన పార్టీ అని విమర్శించారు. అది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదన్నారు. జనసేనలో గెలిచినా తన ప్రయాణం అంతా వైకాపాతోనే అని రాపాక అన్నారు. వైకాపాలో టికెట్టు రాక జనసేనలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. రాజోలు నియోజకవర్గంలో ఉన్న వైకాపా వర్గాల్లో తనదొకటన్న ఆయన... పేచీలకు పోకుండా అందరితో కలిసి వెళ్లాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ చొరవ చూపి ఒకరికి బాధ్యత అప్పగించాలని కోరారు.

rapaka varaprasad
'వైకాపాతోనే నా ప్రయాణం'... జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు
author img

By

Published : Aug 11, 2020, 8:27 PM IST

Updated : Aug 12, 2020, 4:38 AM IST

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో గెలిచినా వైకాపాతో తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వైకాపాలో టికెట్టు కోసం ప్రయత్నించినా... చివరి నిమిషంలో వేరొకరికి వెళ్లిందన్నారు. జగన్, వైవీ సుబ్బారెడ్డితో టికెట్టు కోసం చర్చలు కూడా జరిగాయని ఆయన అన్నారు. కానీ తప్పనిసరై నాగేశ్వరరావుకు టికెట్టు ఇచ్చారన్నారు. ఖాళీగా ఉన్న తనను జనసేన ఆహ్వానించిందన్నారు. రాజోలు నియోజకవర్గంలో కాపులు ఓటింగ్ ఎక్కువ కనుక విజయం సాధించవచ్చు అని ఆ పార్టీలోకి వెళ్లానని రాపాక అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గూడపల్లి పల్లి పాలెం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'గెలిచిన తర్వాత ఏపీ సీఎం జగన్​ను కలిశాను. నీకు టికెట్టు ఇవ్వాలన్నా.. ఇవ్వలేకపోయామని జగన్ అన్నారు. సరే ఎలాగో గెలిచావు, కలిసి పనిచేద్దామని ఆయన కోరారు. ఆ రోజు నుంచి వైకాపాతో కలిసి పనిచేస్తున్నాను. నేను గెలిచిన పార్టీ(జనసేన) ఉండేది కాదు. నాకు బలగం ఉంది కాబట్టి గెలిచాను. మిగిలిన చోట్ల ఎక్కడా ఆ పార్టీ గెలవలేదు కదా. ఆ పార్టీ అధ్యక్షుడే గెలవలేకపోయాడు.

గెలిచినప్పటి నుంచి వైకాపా నుంచే నా ప్రయాణం. నియోజకవర్గంలో వర్గాలున్నాయి. వైకాపాలో ఉన్న వర్గాలను నేను పట్టించుకోవటం లేదు. పేచీకి వెళ్లే ఉద్దేశం నాకు లేదు. కలిసే వెళ్తున్నాను. వాళ్లు కలిస్తే కలుస్తారు లేకపోతే లేదు. అది పార్టీకి మంచిది కాదు. కలుస్తానన్న వాడిని కలుపుకోవాలి. తెలుగు దేశం వాళ్లు ఏం ఇచ్చిన కలవరు. నేను కాంగ్రెస్ పార్టీ వాడిని టికెట్ రాకపోవడం వల్లే ఇతర పార్టీకి వెళ్లాను. ఈ వర్గ రాజకీయాలు పోవాలంటే సీఎం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరికో ఒకరికి బాధ్యత అప్పగించాలి. తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని" ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు.

'వైకాపాతోనే నా ప్రయాణం'... జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

ఇవీచూడండి: పరిస్థితి ఇలాగే ఉంటే.. పోరాటం చేయక తప్పదు: జగ్గారెడ్డి

Last Updated : Aug 12, 2020, 4:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.