ETV Bharat / city

Pawan Kalyan on Floods: ఇప్పుడు ఇసుక ప్రకటనలా..? ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా?: పవన్‌

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan on Floods) ఫైర్ అయ్యారు. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే.. ఇసుకపై వ్యాపార ప్రకటనలు ఇవ్వటమేంటని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా.. అని ట్విటర్ వేదికగా నిలదీశారు.

Pawan Kalyan
Pawan Kalyan
author img

By

Published : Nov 21, 2021, 4:06 PM IST

ఏపీ ప్రభుత్వ చర్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు (pawan kalyan fires on YCP). రాష్ట్రంలో వరదల బీభత్సంతో ప్రజల ఇళ్లు, పశువులు, పంటలు కొట్టుకుపోతున్నాయని.. ప్రాణాలు కోల్పోతున్నారని.. పొలాల్లో ఇసుకమేటలు చూసి రైతులు ఏడుస్తున్నారని ఆవేదన (Pawan Kalyan on Floods) వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇవ్వటమేంటన్న జనసేనాని.. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా..? అని ప్రశ్నించారు.

  • వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం - పంట నష్టం,
    పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి
    సమయంలో వైసీపీ ప్రభుత్వం 'యిసుక అమ్ముతాం ' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? pic.twitter.com/43GorfXoZg

    — Pawan Kalyan (@PawanKalyan) November 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ప్రజల ఇళ్లు, పశువులు, పంటలు కొట్టుకుపోతున్నాయి. పొలాల్లో ఇసుక మేటలు చూసి రైతులు ఏడుస్తున్నారు. ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇస్తోంది. ఈ ప్రభుత్వానికి ఇంగితజ్ఞానం ఉందా..?'

- పవన్‌కల్యాణ్‌, జనసేన అధినేత

జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు కోల్పోయి.. రైతన్నలు బాధలో ఉంటే ఇసుకపై వ్యాపార ప్రకటనలు ఏమిటి..? అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వరదలతో జనం.. సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా..? నీరో తత్వం ఒంటబట్టిందా? అని ట్విటర్ వేదికగా నిలదీశారు.

  • జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు, ఇళ్ళు, పశు సంపద.. సర్వం కోల్పోయి ప్రజలు బాధల్లో ఉంటే అందరికీ అందుబాటులో ఇసుక అని మీ వ్యాపార ప్రకటనలు ఏమిటి ? వరదలతో జనం సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా! నీరో తత్వం ఒంటబట్టిందా?
    ఈ అడ్వర్టైజ్మెంట్స్ అవసరమా? Wake up @ysjagan గారూ!! pic.twitter.com/qt2KMgwqYI

    — Manohar Nadendla (@mnadendla) November 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాయుగుండం దెబ్బకు కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలతో పలు ప్రాంతాలవారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోని వస్తువులు, సామగ్రి, నగదు, నగలు, పత్రాలన్నీ వరదనీటిలో కలిసిపోయాయి. పంట పొలాలు మునిగాయి. గ్రామాల్లో అంధకారం అలుముకుంది. రహదారులు మరింత ఛిద్రమయ్యాయి. అనంతపురం జిల్లా కదిరిలో భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులు. వాయుగుండం వల్ల మొత్తంగా వర్షాల(rains) వల్ల వివిధ సంఘటనల్లో 28 మంది మృత్యువాత పడ్డారు. 17 మంది గల్లంతయ్యారు. అలాగే నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్దకు 2 మృతదేహాలు కొట్టుకువచ్చినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కడప జిల్లా మాండవ్య నది దాటుతుండగా...అక్కాతమ్ముళ్లు నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిద్దరి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కుప్పకూలిన పాపాగ్ని వంతెన డ్రోన్​ వీడియో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.