ETV Bharat / city

జలమండలి ఆదాయాన్ని పెంచాలి : ఎండీ దాన కిషోర్ - జలమండలి ఆదాయాన్ని పెంచాలి : ఎండీ దాన కిషోర్

హైదరాబాద్ మహా నగర జలమండలి పరిధిలో ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలని ఎండీ దాన కిషోర్ ఆదేశించారు. ఈ మేరకు ఖైరతాబాద్​లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో దాన కిషోర్ సమావేశం
జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో దాన కిషోర్ సమావేశం
author img

By

Published : Dec 18, 2019, 5:09 AM IST

Updated : Dec 18, 2019, 6:43 AM IST

జలమండలి పరిధిలోని సీజీఎం, జీఎంలు తమకు నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాలు పూర్తి చేసి... ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఎండీ దాన కిషోర్ ఆదేశించారు. మొండిబకాయిల వసూళ్లు, బిల్లులు చెల్లించని కనెక్షన్ల తొలగింపునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ వీడీఎస్-2019, సెవరేజీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించడం కోసం డీజీఎంలు తమ పరిధిలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

వచ్చే ఫిబ్రవరి వరకు అమలులో వీడీఎస్-2019

వీడీఎస్-2019 ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా 2300 అక్రమ నల్లా కనెక్షన్‌దారుల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. త్వరలోనే వీరికి క్యాన్ నెంబర్లు కేటాయిస్తామని వివరించారు. వీడీఎస్-2019 వచ్చే ఫిబ్రవరి 21 వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జరిమానాలు, క్రిమినల్ కేసుల బారిన పడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఎండీ కోరారు. ఒకేసారి కనెక్షన్ ఛార్జీల రూపంలో సుమారు రూ. 9.3 కోట్లు, ప్రతీ నెల నల్లా బిల్లుల ద్వారా దాదాపు రూ.22 లక్షల ఆదాయం సమకూరుతుందని వివరించారు. పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో సెవరెజీ ఓవర్ ఫ్లోలు, మంచినీటి లీకేజీలు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యుద్ధ ప్రాతిపదికన చర్యలు

మ్యాన్ హోళ్లు ధ్వంసమైతే యుద్ధ ప్రతిపాదికన మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. పురపాలక మంత్రి కేటీఆర్ సూచనతో నాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్) నుంచి ఔట్ సోర్సింగ్ విధానంలో 45 మంది సైట్ ఇంజనీర్లను తీసుకున్నట్లు తెలిపారు. వీరికి ఆరు రోజుల పాటు ఓ అండ్ ఎం, రెవెన్యూ, వాటర్ ట్రీట్ మెంట్, సెవరెజీ ట్రీట్ మెంట్​పై అవగాహాన కల్పించినట్లు వివరించారు.

జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో దాన కిషోర్ సమావేశం

ఇవీ చూడండి : రాష్ట్రంలో కల్వకుంట్ల అమ్మకపు పన్ను అమలవుతోంది: రేవంత్​

TG_Hyd_71_17_Jalamandali_MD_Review_AV_3182301 Reporter: Karhik Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) జలమండలి పరిధిలోని సీజీఎం, జీఎంలు తమకు నిర్ధేశించిన రెవెన్యూ లక్ష్యాలను పూర్తి చేసి రెవెన్యూ పెంచేందుకు కృషి చేయాలని జలమండలి ఎండీ దాన కిషోర్ ఆదేశించారు. మొండిబకాయిల వసూళ్లు, బిల్లులు చెల్లించని కనెక్షన్ల తొలగింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ చెప్పారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ విడిఎస్-2019, సెవరేజీ పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్రమ నల్లా కనెక్షన్లు క్రమబద్దీకరించడం కోసం డీజీఎమ్ లు తమ పరిధిలో ప్ర్యతేక క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. విడిఎస్-2019 ద్వారా ఇప్పటీ వరకు దాదాపుగా 2300 అక్రమ నల్లా కనెక్షన్ దారుల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీరికి త్వరలోనే క్యాన్ నెంబర్లు కేటాయిస్తామని వివరించారు. విడిఎస్-2019 వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు అమలులో ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున జరిమానాలు, క్రిమినల్ కేసుల బారిన పడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఎండీ మరోసారి నగరవాసులను కోరారు. ఒకేసారి కనెక్షన్ ఛార్జీల రూపంలో దాదాపుగా రూ. 9.3 కోట్లు, నెలనెల నల్లా బిల్లు ద్వారా దాదాపు రూ. 22 లక్షల ఆదాయం సమకూరుతుందని వివరించారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో సెవరెజీ ఓవర్ ఫ్లోలు, మంచినీటి లీకేజీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎండీ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్ఫష్టంచేశారు. అలాగే ఏవైనా మ్యాన్ హోళ్లు ధ్వసమయితే యుద్దప్రతిపాదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచనతో నాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్) నుంచి ఔట్ సోర్సింగ్ విధానంలో 45 మంది సైట్ ఇంజనీర్లను తీసుకున్నట్లు వివరించారు. వీరికి ఆరు రోజుల పాటు ఓ అండ్ ఎమ్, రెవెన్యూ, వాటర్ ట్రీట్ మెంట్, సెవరెజీ ట్రీట్ మెంట్ లపై అవగాహాన కల్పించినట్లు తెలిపారు. వీరిని ఓ అండ్ ఎమ్ డివిజన్లకు కేటాయిస్తామని ఎండీ తెలిపారు.
Last Updated : Dec 18, 2019, 6:43 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.