ETV Bharat / city

KTR Help : మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్​.. - మంత్రి కేటీఆర్​ వార్తలు

KTR Help : మంత్రి కేటీఆర్​ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద విద్యార్థినుల ఎంబీబీఎస్ కలను నెరవేర్చేందుకు ఆర్థిక సహాయం అందించారు.

KTR MBBS
KTR MBBS
author img

By

Published : Feb 14, 2022, 10:35 PM IST

KTR Help : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​... మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన అవునూరి అఖిల, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన నీట్​లో మంచి మార్కులు సాధించి మెడిసిన్​లో సీటు సంపాదించారు. మల్లారెడ్డి మెడికల్ కళాశాల, టీఆర్ఆర్ మెడికల్ కళాశాలల్లో సీటు దక్కించుకున్న వీరికి.. కుటుంబ పరిస్థితి కారణంగా ఫీజులు చెల్లించడం కష్టంగా మారింది. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ఆయన.. వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.

Minister KTR
విద్యార్థినికి చెక్కు అందిస్తున్న మంత్రి కేటీఆర్​

ఇవాళ ప్రగతిభవన్​లో తనను కలిసిన విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ఎంబీబీఎస్​లోనూ ఇదే స్ఫూర్తి, పట్టుదలతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఏదైనా సాధించాలనుకుంటే తమకున్న పరిమితులు, పేదరికం, ఆర్థిక పరిస్థితి వంటివి అడ్డుకాదని నిరూపించారని అఖిల, స్పందనను కేటీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలియజేసిన విద్యార్థినులు.. తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సమాజానికి తమవంతు సేవ చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి : ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.