ETV Bharat / city

ఐటీలో 30 శాతానికి చేరిన ‘వర్క్‌ ఫ్రం హోం’ - Covid-19 latest updates

హైదరాబాద్‌ ఐటీ సంస్థల్లో వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసే ఉద్యోగులు 30 శాతానికి చేరారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ల్యాప్‌టాప్‌ల కోరత ఏర్పడింది.

work from home
‘వర్క్‌ ఫ్రం హోం’
author img

By

Published : Mar 19, 2020, 7:21 AM IST

తమ ప్రాజెక్టులపై కరోనా ప్రభావం పడకుండా హైదరాబాద్‌లో ఐటీ సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలో.. తొలుత పది శాతానికే పరిమితమైన ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 30 శాతానికి చేరింది. ఇంటినుంచి పని విధానంతో ఇప్పటికే మార్కెట్‌లో ల్యాప్‌టాప్‌ల కొరత ఏర్పడింది. ఐటీ సంస్థలకు గంపగుత్తగా అద్దెకు ఇచ్చే ధరలూ పెరిగాయి. గతంలో ల్యాప్‌టాప్‌కు నెలకు రూ.1200 వరకు ఉన్న అద్దె రూ.4 వేలకు పెరిగింది.

అందరికి కుదరదు..

ఐటీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇంటి నుంచి పని సాధ్యం కాదు. పనిచేస్తున్న కేటగిరీ, రంగాల ఆధారంగా ఈ అవకాశం ఉంటుంది. అలాగే సర్వీసు రంగాల్లోని ఉద్యోగులకు అసలు కుదరదు. టెక్నికల్‌ సపోర్టు ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ప్రత్యేక హక్కులు కలిగిన సాఫ్ట్‌వేర్‌ను బయటకు ఇవ్వరు. ఈ నేపథ్యంలో 100 శాతం ‘వర్క్‌ ఫ్రం హోం’ కుదరదని కంపెనీలు చెబుతున్నాయి.

ఎస్‌ఈజెడ్‌ దరఖాస్తుకు కరోనా గండం

ఐటీ పెట్టుబడులకు కరోనా అడ్డంకిగా మారుతోంది. ఐటీ కంపెనీలు ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌) కింద యూనిట్‌గా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. 15 ఏళ్లపాటు పన్ను సదుపాయాలు పొందాలంటే గడువులోగా దరఖాస్తు చేయాలి. అయితే, ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్న విదేశాల్లోని ఐటీ కంపెనీలను కరోనా భయం వెంటాడుతోంది. ఈ సమస్య ముగిసేదాకా గడువు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇవీ చూడండి: మూసివేత దిశగా వ్యవసాయ మార్కెట్​ యార్డులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.