ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్-2 నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు. వారికి పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతిష్ఠాత్మకమైన జీఎస్ఎల్వీ మార్క్-3 ఎం1 వాహన నౌక ప్రయోగం సోమవారం వేకువజామున నిర్వహించనున్నట్లు శివన్ తెలిపారు. ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వెంకన్న ఆశీస్సుల కోసం వచ్చామని తెలిపారు.
ఇదీ చదవండి.. ఇంజినీరింగ్లో అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు'