ETV Bharat / city

పెగాసస్‌పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: ఏబీ వెంకటేశ్వరరావు - పెగాసస్ న్యూస్

ఏపీలో పెగాసస్‌ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. నిఘా విభాగాధిపతిగా తాను పనిచేసిన కాలంలో పెగాసస్‌ను కొనలేదని.., వాడలేదని తేల్చిచెప్పారు. ఉద్దేశపూర్వకంగా తనపై వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడ్డారన్నారు. పెగాసస్‌పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

AB Venkateswara rao
ఏబీ వెంకటేశ్వరావు
author img

By

Published : Mar 21, 2022, 6:31 PM IST

ఏపీలో పెగాసస్‌పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరావు స్పష్టం చేశారు. ఫోన్ల గోప్యతపైనా ప్రజలకు అనేక అనుమానాలున్నాయని.. ప్రజల భయం, ఆందోళనకు తెరదించాలని పేర్కొన్నారు.పెగాసస్‌ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను..ఆయన ఖండించారు. నిఘా విభాగాధిపతిగా తాను పనిచేసిన కాలంలో పెగాసస్‌ను కొనలేదని..వాడలేదని తేల్చిచెప్పారు.

"2019 మే వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ప్రభుత్వం, డీజీపీ, సీఐడీ, ఏసీబీ.. ఇలా ఏ ప్రభుత్వ విభాగం కూడా పెగాసస్‌ను కొనలేదు..వాడలేదు. ఏ ఇతర ప్రైవేటు సంస్థలు సైతం పెగాసస్‌ను వాడలేదు. ఎక్కడా ఫోన్లు ట్యాప్‌ కాలేదు. 2019 మే తర్వాత ఏం జరిగిందనే దానికి నా దగ్గర సమాచారం లేదు. 2021 ఆగస్టు వరకు ఈ పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని డీజీపీ కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు." -ఏబీ వెంకటేశ్వర్లు

అదంతా కుట్రపూరిత ప్రచారం..

ఉద్దేశపూర్వకంగా తనపై వ్యక్తిత్వ హవనానిని పాల్పడ్డారని ఆరోపించారు. గతంలోనూ తనపై ఇలానే ఆరోపణలు చేశారని తనపై అసత్య ప్రచారం చేశారని..విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలకు... ఛార్జ్‌షీట్‌ పేర్కొన్న అంశాలకు ఎక్కడా పొంతనలేదని చెప్పారు. కుట్ర పూరితంగా అసత్య ప్రచారం చేశారని.. ఇప్పుడు కూడ పెగాసస్‌పై ఇలానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. పెగాసెస్ విషయంలో ఎవరికీ అనుమానాలొద్దని.. 2019 మే వరకు మాత్రం కొనలేదని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.

"రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా కొననిది, వాడని దాన్ని తీసుకొచ్చి నాతో ముడిపెట్టడం సరికాదు. నాపై వచ్చిన ఆరోపణలకు నేను సమాధానం చెప్పాల్సి రావడం నా దౌర్భాగ్యం. పెగాసస్‌తో ముడిపెట్టి నాపై పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నాపై బురద చల్లడం, వ్యక్తిత్వ హననం చేయడం ఎంతవరకు కరెక్టు ?. నాపై చేస్తున్న ప్రచారమంతా అబద్ధమని తెలిసి నేను నిశ్చింతగా ఉన్నాను. 30 ఏళ్ల పాటు వృత్తి ధర్మం పాటించాను. నా సర్వీసు మొత్తం వ్యక్తిత్వం కాపాడుకునేందుకు ప్రయత్నించాను. ఇన్ని అసత్యాలు ప్రచారం చేస్తే రేపు అఖిలభారత ఉద్యోగులు ఎలా పనిచేస్తారు ? నన్ను సస్పెండ్ చేస్తే.. కోర్టులో ఛాజెంజ్‌ చేశా. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు నేను వ్యతిరేకించడం లేదు. నేను నిఘా విభాగాధిపతిగా ఉన్నంతకాలం పెగాసస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను కొనలేదు." -ఏబీ వెంకటేశ్వర్లు

వారిపై పరువు నష్టం దావా వేస్తా..

తనపై కేసులు పెట్టేందుకు కొందరు తప్పుడు పత్రాలు సృష్టించారని ఏబీ వెకంటేశ్వరరావు మండిపడ్డారు. కేసు విచారణలో తప్పుడు పత్రాల గురించి తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. తనపై జరిగిన కుట్రకు‌ విచారణ కోరినా స్పందన లేదన్నారు.

"సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌, విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా వేస్తున్నా. అమర్‌నాథ్‌, అబ్బయ్య చౌదరి, పయనీర్, గ్రేట్ ఇండియాపై పరువునష్టం దావా. పరువునష్టం దావాకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. నాపై కుట్రపూరితంగా అసత్యాలు ప్రచారం చేశారు. డిసెంబరులో ఛార్జిషీట్‌ ఇచ్చేవరకు ఈ నిందలు మోయాల్సిందే. పూడి శ్రీహరి ఇచ్చిన సమాచారం ఛార్జిషీట్‌లో లేదు. సీఎస్‌ కార్యాలయంలో 3 వినతిపత్రాలు ఇచ్చా. నా సస్పెన్షన్ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. నాపై విచారణ త్వరగా పూర్తి చేయాలి. రూ.25 కోట్ల కుంభకోణం మోయాలా.. మీరు ఇష్టం వచ్చినట్లు రాస్తారా ?." -ఏబీ వెంకటేశ్వరరావు

ఇదీ చదవండి: CM KCR on Kashmir Files: 'ఈ కశ్మీర్ ఫైల్స్ ఏంటో.. దిక్కుమాలిన వ్యవహారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.