ETV Bharat / city

క్షీర, నీలి, పింక్ విప్లవాల దిశగా అడుగులు: మంత్రి తలసాని - interview with minister talasani srinivas yadav

వ్యవసాయ అనుబంధ రంగాలకు మంచి రోజులు రాబోతున్నాయి. పెరుగుతున్న జనాభా, పౌష్టిక విలుగల ఆహారపు అలవాట్లు, అరుచులకు అనుగుణంగా పాడి, మత్స్య, మాంసం పరిశ్రమ రంగాలకు పెద్దపీట వేసిన సర్కారు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. నీలి, క్షీర, పింక్ విప్లవాల దిశగా అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో మత్స్య సంపద పెంపొందించే లక్ష్యంతో ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్యల పిల్లలు పంపిణీ కోసం సర్కారు శ్రీకారం చుట్టనుంది. ప్రధాన జలాశయాలుసహా 24 వేల చెరువులు, ఇతర నీటి వనరుల్లో ఈ విత్తనం చల్లనున్నారు. క్షీర విప్లవం సాధనలో భాగంగా ఈ శ్రావణమాసంలోనే నగర శివారు మామిడిపల్లి వద్ద రూ.250 కోట్ల వ్యయంతో "మెగా డెయిరీ" నిర్మాణానికి పునాదిరాయి పడనుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దృష్ట్యా... రెండో విడత పాడి గేదెల పంపిణీ చేయనుంది. పింక్‌ విప్లవం చర్యల్లో భాగంగా వీలైనంత త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామంటున్న పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో 'ఈటీవీ భారత్‌' ముఖాముఖి.

interview with minister talasani srinivas yadav
క్షీర, నీలి, పింక్ విప్లవాల దిశగా అడుగులు: మంత్రి తలసాని
author img

By

Published : Aug 1, 2020, 4:41 AM IST

క్షీర, నీలి, పింక్ విప్లవాల దిశగా అడుగులు: మంత్రి తలసాని

ప్రశ్న : రాష్ట్రంలో ఈ సారి ఎన్ని కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లలు... ఎంత పరిమాణంలో పంపిణీ చేయబోతున్నారు..? అందుకోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు.?

జవాబు : రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే వ్యవసాయ అనుబంధ రంగాలకు మంచి రోజులు వచ్చేశాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచే ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నది సీఎం ఆలోచన. కుల వృత్తులపై ఆధారపడిన కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న యోచనలో భాగంగా గంగపుత్రులు, ముదిరాజు, తెనుగు, గోండ్లకు ఉచితంగా చేప విత్తనం పంపిణీ గత ఐదేళ్లుగా బ్రహ్మండంగా చేస్తున్నాం. ఈ ఏడాది రమారమి 24 వేల చెరువుల్లో 81 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు సరఫరా చేయబోతున్నాం. ఇది ఒక సంపద సృష్టించి ఆయా కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. వారు సమాజంలో సగౌరవంగా జీవించాలన్నది లక్ష్యం. ఆగస్టు 5 నుంచి చేపట్టబోతున్న ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక వనరులు కల్పించనట్లవుతోంది.

ప్రశ్న : ఈ ఏడాది చేప పిల్లల పంపిణీలో తెలంగాణ చేప "కొర్రమీను"కు ఏమైనా ప్రాధాన్యత ఇస్తున్నారా?... ఏ ఏ రకాలు సరఫరా చేస్తున్నారు.?

జవాబు : బంగారు తీగ లాంటి రకాల విత్తనాలు ఇస్తున్నాం. కొర్రమీను రకం చేప పిల్లలు ఇవ్వాలంటే మనకు దేశంలోనే అంత భారీ పరిమాణంలో దొరకవు. తెలంగాణ వాతావరణం పరిస్థితులు, నేలలు, నీరు, ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా చేప పిల్లలే ఇస్తున్నాం. అదే రీతిలో సంపద కూడా వస్తుంది. కాబట్టి ఈ రోజు మత్స్యకార కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. దేశంలో తొలిసారిగా తెలంగాణలో రొయ్యలు కూడా పరిచయం చేశాం. అవి ఈ సారి పెద్ద ఎత్తన పెంచాం.

ప్రశ్న : తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో మత్స్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు నోచుకోలేదు. అందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా...?

జవాబు : ఈ రోజున మత్స్య పరిశోధన అనేది సాగుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా పాలేరు సహా మానేరు డ్యాం, వనపర్తి వద్ద మత్స్య పరిశోధన స్థానం ఏర్పాటు కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం. తప్పకుండా రాబోవు రోజుల్లో మత్స్యకార కుటుంబాలు, రైతులు బాగుండాలి. ఆర్థిక సంపద పెరగాలి. మన రాష్ట్రం కాకుండా దేశానికి, ప్రపంచంలో వివిధ దేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆ పద్ధతిలోనే ప్రోత్సహిస్తున్నారు.

ప్రశ్న : ఈ ఏడాది ప్రతిష్టాత్మక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా నీటి లభ్యతలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మత్స్య సంపద వృద్ధి రేటు ఎలా ఉండబోతోంది. ప్రభుత్వపరంగా ఎలాంటి లక్ష్యాలు నిర్థేశించింది.?

జవాబు : బ్రహ్మాండంగా... నేను ఏమంటా అంటే ప్రతి నీటి బొట్టు ఉన్న దగ్గరల్లా చేప పిల్లలు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని శాసనసభలో సైతం సీఎం స్పష్టం చేశారు. గత ఏడాది కొండపొచమ్మసాగర్, కాళేశ్వరం, సుందిళ్లలో కూడా చేప పిల్లలు వేశాం. ఈ సారి రంగనాథసాగర్, కొండపోచమ్మసాగర్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన జలాశయాల్లో చేపలు వేయబోతోన్నాం.

ప్రశ్న : ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల తరహాలో తెలంగాణలో కూడా ఫిష్ కల్చర్‌ను పరిశ్రమ తరహాలో తీర్చిదిద్దే అవకాశం ఉందా... ఆసక్తిగల ఔత్సాహికపారిశ్రామికవేత్తలకు ఆ రకమైన ప్రోత్సాహకాలు ఇస్తారా...?

జవాబు : తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఏపీలో ప్రైవేటుగా చేస్తున్నారు. పెద్దగా ప్రభుత్వం మద్ధతు ఉండదు. తెలంగాణలో ప్రభుత్వమే మద్ధతు ఇచ్చి ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంకా చేయూతనివ్వాలన్నదే తమ లక్ష్యం. ఎందుకంటే యువతరం కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తోంది. విద్యావంతులు, నిరుద్యోగులు సైతం మత్స్య రంగంలో నైపుణ్యాలు సంపాదించేందుకు వీలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహణకు శ్రీకారం చుట్టాం.

ప్రశ్న : కరోనా నేపథ్యంలో నగరాలు, పట్టణాల నుంచి యువత, ప్రైవేటు, ఐటీ, సేవా, ఇతర రంగాలకు చెందిన కుటుంబాలు గ్రామాలబాట పట్టడంతో నిరుద్యోగం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి వారిని మత్స్య రంగంపై మళ్లించే అవకాశం ఉందా...?

జవాబు : తెలంగాణ వాతావరణంలో నిరుద్యోగం ఎక్కడ ఉన్నప్పటికీ... ఈ రోజు గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, హైదరాబాద్ తీసుకుంటే ఎక్కడా కూడా నిరుద్యోగం సమస్య రాదు. కరోనా అనేది యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య కాబట్టి... అవన్నీ తాత్కాలికమైనవే. ఇప్పుడు కుల వృత్తి ఉంది. వాటిని ప్రోత్సహించడానికి చేసే ప్రయత్నాలు ప్రభుత్వపరంగా సాగుతాయి. ప్రస్తుతం నగరంలో చేపలు కొనాలంటే రాంనగర్, బేగంబజార్‌ లాంటి కొన్ని మార్కెట్లే ఉన్నాయి. త్వరలో 150 డివిజన్లలో ఒకటి చొప్పున మొబైల్ చేపల ఔట్‌లెట్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇలా ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాం.

ప్రశ్న : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మామిడిపల్లిలో ఏర్పాటు చేయబోతున్న మెగా డెయిరీ కోసం ఎన్ని నిధులు వెచ్చిస్తారు. ఎన్ని లీటర్ల సామర్థ్యం గల ఫ్యాక్టరీ రాబోతోంది?

జవాబు : ఇప్పుడు మార్కెట్‌లో పోటీ దృష్ట్యా విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకే ఈ మెగా డెయిరీ ఏర్పాటు చేయబోతున్నాం. పశుసంవర్థక శాఖకు చెందిన 67 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో కొంత భాగం తీసుకుని బ్రహ్మాండమైన పరిశ్రమ నిర్మించాలన్నది లక్ష్యం. దగ్గర దగ్గర రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. పక్కాగా మంచి డెయిరీ వస్తుంది. అది దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మెగా డెయిరీ ఏర్పాటు చేయనున్న దృష్ట్యా... గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో అధ్యయం చేయాలని అధికారులకు సూచించాం. విదేశాల్లో సైతం అత్యుత్తుమంగా నడిచే డెయిరీల నిర్వహణపై అధ్యయనం చేసి ఆ పద్ధతుల్లోనే నిర్మించాలన్నది ఉద్దేశం.

ప్రశ్న : అదే గ్రామంలో షీడ్ బ్రీడింగ్ కేంద్రం కూడా ఏర్పాటు చేయబోతున్నారు...? అది ఎప్పటి లోగా కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి...?

జవాబు : వీలైనంత తొందరగానే షీడ్ బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. అది కూడా దేశానికి ఆదర్శంగా ఉంటుంది. బ్రీడింగ్‌ సెంటర్‌తోపాటు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఓ సంస్థ కూడా నిర్మిస్తాం. సువిశాలమైన స్థలం ఉన్నందున సకల హంగులతో కూడా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ అందుబాటులోకి తీసుకొస్తాం. వ్యవసాయ అనుబంధ పాడి - పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రోత్పహించాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఇప్పటికే ఆ దిశగా ముందుకు వెళుతున్నాం. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. భవిష్యత్తులో ఆ కుటుంబాలు చాలా సంతోషంగా ఉండాలన్నదే సర్కారు నిశ్చయం.

ప్రశ్న : రాష్ట్రంలో రెండో విడత పాడి గేదెలు, గొర్రెల పంపిణీ ఎప్పుడు ప్రారంభించబోతున్నారు...? అందుకు సంబంధించి కార్యాచరణ ఎలా

ఉంది...?

జవాబు : వీలైనంత త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభించబోతున్నాం. ఆ కార్యక్రమానికి కూడా బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయి. కానీ, అనివార్య కారణాల వల్ల కొంత వాతావరణ పరిస్థితులు, ఇతర సమస్యల మూలంగా ఆ ప్రక్రియ కొంత ఆపడం జరిగింది. గొర్రెలు పంపిణీ 50 శాతం, పాడి గేదెలు 50 శాతం పూర్తైన దృష్ట్యా... మిగతా ప్రక్రియ త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తాం.

ప్రశ్న : పీవీ నర్సింహారావు పశు విశ్వవిద్యాలయం పాలన గాడి తప్పిందనే విమర్శలు వస్తున్నాయి. పరిశోధన, విస్తరణ మందగించింది. ఈ ఆరేళ్లలో ఒక కోడి, గొర్రె, మేక, ఆవు, గేదె కొత్త బ్రీడ్ విడుదల కాలేదు.? ఆ అంశంపై ఎలాంటి దృష్టి కేంద్రీకరిస్తారు...?

జవాబు : తప్పకుండా పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పాలనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం. ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. పాలన, పరిశోధన, విస్తరణ రంగాలను గాడిలో పెడతాం. ఇప్పటికే చాలా మంది వర్సిటీలో శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులు రాజేంద్రనగర్, కోరుట్ల పశువైద్య కళాశాలల్లో చదువుకుని ఉన్నత విద్య అనంతరం దేశ, విదేశాల్లో మంచి స్థానాల్లో ఉండి సేవలందిస్తున్నారు.

ఇవీ చూడండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.