హైదరాబాద్లోని బసవతారకం ఇండో క్యాన్సర్ ఆస్పత్రిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు, ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ పాల్గొన్నారు. పురాతన కాలం నుంచి వస్తోన్న ఈ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గమని వివరించారు.
రోగనిరోధక శక్తి పెంచే ఉత్తమ మార్గం... యోగాభ్యాసమని బాలకృష్ణ తెలిపారు. యోగా ద్వారా మనసును అదుపులో ఉంచుకోవచ్చన్నారు. శారీరకంగా ఎంత మంచిగా ఉన్నా... మానసికంగా ఇబ్బందులు ఉంటే మంచిది కాదని.. మానసిక స్వస్థత కూడా చాలా ముఖ్యమని బాలయ్య పేర్కొన్నారు. ఏ వయసు వారైనా సరైన పద్ధతిలో యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువులను ఆయన సత్కరించి అభినందించారు.
ఇదీ చూడండి: Yoga Day 2021: ఈ ఆసనాలతో అన్ని లాభాలా?