ETV Bharat / city

అలరించిన అంతర్జాతీయ సంగీత, నృత్య పోటీలు - international music and dance competitions cum awards festival

సింగపూర్​లో నిర్వహించిన అంతర్జాతీయ సంగీత, నృత్య పోటీలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. 150 మందికి పైగా కళాకారులు ఒకే వేదికపై ప్రదర్శనలు ఇవ్వడం వల్ల ఆ ప్రాగణమంతా ఆహ్లాదంగా మారింది. శాస్త్రీయ సంగీత, శాస్త్రీయ నృత్య పోటీలు, కళామహోత్సవాలతో కళాభిమానులు తన్మయంతో పులకించిపోయారు.

Singapore
author img

By

Published : Aug 30, 2019, 8:29 PM IST

international music and dance competitions cum awards festival held in Singapore
సింగపూర్​లో జరిగిన అంతర్జాతీయ సంగీత, నృత్య పోటీలు

సింగపూర్ తెలుగు సమాజం, త్యాగయ్య టీవీ సంయుక్తంగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ప్రాంగణంలో అంతర్జాతీయ సంగీత, నృత్య పోటీల బహుమతుల ప్రధానోత్సవం 2019 నిర్వహించింది. ఈ కార్యక్రమం సింగపూర్ వాసులను మంత్ర ముగ్ధులను చేసింది. 150 మందికిపైగా కళాకారులు పాల్గొని తమ కళానైపుణ్యంతో ఆహూతులను కట్టిపడేశారు. శాస్త్రీయ సంగీత, శాస్త్రీయ నృత్య పోటీలు, కళామహోత్సవంతో కళాభిమానులు తన్మయంతో పులకరించిపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కర్ణాటక సంగీత విధుషీమణి, నేపథ్య గాయని డాక్టర్ నిత్యశ్రీ మహదేవన్, నాట్యాచార్య డాక్టర్ కృష్ణకుమార్ పాల్గొన్నారు.

శాస్త్రీయ సంగీత విశేషాలను, ఆవశ్యకతను నిత్యశ్రీ వివరించారు. ఇంతమంది కళాకారులకు సింగపూర్ లాంటి మహానగరంలో అంతర్జాతీయస్థాయిలో వేదిక కల్పించి వారి నైపుణ్యాన్ని బాహ్య ప్రపంచానికి చూపించే అవకాశం కల్పించిన సింగపూర్ తెలుగు సమాజం, త్యాగయ్య టీవీలను ప్రత్యేకంగా అభినందించారు. శాస్త్రీయ నృత్య విశేషాలను, ప్రాముఖ్యతను, మహావిద్వాంసులు శ్రీ త్యాగరాజు జీవిత విశేషాలను కృష్ణకుమార్ వివరించారు. అన్నమాచార్య కీర్తనలకు ఆయన శిష్యబృందం ప్రదర్శించిన నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అవార్డులు అందుకుంటున్న కళాకారులు

ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి అన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సింగపూర్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించేదుకు కృషిచేసిన సింగపూర్ తెలుగు సమాజానికి త్యాగయ్యటీవీ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. నిత్యశ్రీ, కృష్ణకుమార్​ను జీవన సాఫల్య పురస్కారం, కోటిరెడ్డిని కళాబంధు బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఇదీ చూడండి: ఒక్క ఎకరానికైనా కాళేశ్వరం నీరిచ్చారా..?: భట్టి విక్రమార్క

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.