ETV Bharat / city

అలా.. సర్పంచ్‌ ‘గోల్‌’ కొట్టారు - international player as sarpanch

క్రీడాకారిణిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించారామె. వివాహం తర్వాత లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా రాణించారు. అక్కడ సంతృప్తి లేక భారత్‌కు తిరిగొచ్చి పోలీస్‌ ఉన్నతాధికారిగా ఎంపికయ్యారు. కానీ ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో సర్పంచ్‌గా పోటీ చేసి ఘనవిజయం సాధించారు.

క్రీడాకారిణి నుంచి సర్పంచ్ వరకు ఆమె ప్రయాణం..

author img

By

Published : Feb 24, 2021, 11:29 AM IST

క్రీడాకారిణి నుంచి సర్పంచ్ వరకు ఆమె ప్రయాణం..

ఆమె పేరు తోట అనూష. ఉస్మానియ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్‌, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌లో పీజీ పట్టా పొందారు. హైదరాబాద్‌కు చెందిన ఈమె కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చెందిన శశిభరత్‌ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి ఉన్న ఈమెకు.... రోలర్‌ స్కేటింగ్‌లో తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. అలా స్కేటింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించారు.

దక్షిణ భారత దేశం నుంచి తొలి మహిళగా రికార్డు...

దక్షిణ భారతం నుంచి రోలర్‌ హాకీ విభాగంలో దేశానికి ప్రాతినిద్యం వహించిన తొలి మహిళగా రికార్డు సాధించారు. మొత్తం 14 సార్లు జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. 2005లో దక్షిణ కొరియాలో జరిగిన 11వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ క్రీడల్లో వెండి పతకం గెలిచారు. 2004లో జర్మనీలో జరిగిన ఏడో ప్రపంచ మహిళల వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. ఇండియా రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ కమిటీకి 2017లో రెఫరీగా ఎంపికయ్యారు. జాతీయ స్థాయి మహిళా జట్టుకు శిక్షణ ఇచ్చారు.

పోలీస్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి...

వివాహం అనంతరం లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా రాణించారు. భారత్‌పై ఉన్న అభిమానంతో అక్కడి నుంచి తిరిగొచ్చారు. ఇక్కడే ప్రజలకు ఏదో చేయాలనే లక్ష్యంతో ఉన్నతచదువులు చదివి పోలీస్‌ విభాగంలో ఉద్యోగం సాధించారు. కానీ అనుకున్న స్థాయిలో ఉద్యోగం రాలేదని దానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. భర్త స్వగ్రామం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మహిళకు రిజర్వ్‌ కావడంతో...సర్పంచ్‌గా పోటీ చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకు అత్తింటి వారు, భర్త సహకారం ఉండటంతో.. సర్పంచ్‌గా గ్రామస్ధులు ఆదరించారు.

ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెబుతున్నారు అనూష. అంతేకాకుండా మహిళకు పెద్దపీట వేస్తానని.. యువతకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పించేలా కృషి చేస్తానని చెబుతున్నారు.

ఇదీ చదవండి: వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ గరుడ పక్షి ప్రదక్షిణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.