Intermediate Exams Schedule 2022 : ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. ఇప్పుడు అప్పుడు అంటూ రోజుకో తేదీ మారుస్తూ వస్తోన్న ప్రకటనలతో విద్యార్థులంతా అయోమయంలో పడుతున్నారు. వారి అనుమానాలకు చెక్ పెడుతూ ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది.
Telangana Inter Exams 2022 : మే 6 నుంచి 23 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. మే 7 నుంచి 24 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. జేఈఈ మెయిన్ తేదీల మార్పుతో పరీక్ష తేదీలను సవరించినట్లు ఇంటర్మీడియ్ బోర్డు తెలిపింది.
విద్యార్థులంతా పరీక్షలకు బాగా సన్నద్ధమవ్వాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ సూచించారు. నడివేసవిలో పరీక్షలు జరగనున్నందున విద్యార్థులంతా నీళ్లు ఎక్కువగా తాగుతూ సరైన ఆహారం తీసుకుంటా ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. పరీక్షలకు 40రోజులకు పైగా సమయం ఉందని.. జాగ్రత్తగా రీడింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు. కరోనా, ఒమిక్రాన్, లాక్‌డౌన్ భయాలేవీ ఇప్పుడు లేనందున ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అన్నారు ఒమర్ జలీల్.
- ఇదీ చదవండి : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మార్పు