ETV Bharat / city

INTER CLASSES: సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ క్లాసులు - ఆంధ్రప్రదేశ్ న్యూస్

ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సెలవుల్లో కోతలు విధించారు. రెండో శనివారం తరగతులు కొనసాగుతాయి. టర్మ్ సెలవులు ఉండవు.

inter-first-year-classes-start-in-ap-on-september-first-onwards
సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ క్లాసులు
author img

By

Published : Aug 18, 2021, 12:03 PM IST

ఏపీలో ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులకు సెప్టెంబరు ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 188 రోజులపాటు తరగతులను నిర్వహించనున్నారు. రెండో శనివారమూ కళాశాలలు కొనసాగుతాయి. టర్మ్‌ సెలవులు ఉండవు.

ఈమేరకు అకడమిక్‌ క్యాలండర్‌ను ఇంటర్‌ విద్యా మండలి విడుదల చేసింది. పబ్లిక్‌ పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటాయి. తరగతులు ఏప్రిల్‌ 23 వరకు కొనసాగుతాయి. ఏప్రిల్‌ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులిస్తారు. అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలను మే చివరి వారంలో నిర్వహిస్తారు. జూన్‌ ఒకటి నుంచి 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.

సప్లిమెంటరీ పరీక్ష రుసుం గడువు పొడిగింపు

ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్ష రుసుం చెల్లింపు గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గతంలో ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియడంతో పొడిగించామని వివరించారు.

ఇదీ చూడండి: TS ECET Results 2021: తెలంగాణ ఈసెట్‌-2021 ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.