ETV Bharat / city

విజయవాడ దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమలు అదృశ్యం?

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని సింహాలపై వస్తున్న వార్తలు దేవాలయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత రథాల పరిశీలన, భద్రత అంశాలపై పోలీసులు ఈనెల 13న సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెండి రథాన్ని అధికారులు పరిశీలించగా... సింహాల ప్రతిమ కనపడలేదన విషయాన్ని గుర్తించినట్లు సమాచారం.

indrakeeladri-silver-chariot-statue-of-lions-to-have-reported-missing
విజయవాడ దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమలు అదృశ్యం?
author img

By

Published : Sep 16, 2020, 7:06 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సంబంధించిన వెండి రథానికి ముందు, వెనుక భాగాన అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యమయ్యాయన్న విషయం మంగళవారం బయటకురావడం దేవాలయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికారికంగా ఈ విషయాన్ని ఎవరూ ధ్రువీకరించడం లేదు. అంతర్వేది ఘటన తర్వాత రథాల పరిశీలన, భద్రత అంశాలపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులతో 13న పశ్చిమ ఏసీపీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెండి రథాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. అప్పుడే సింహాల ప్రతిమలు కనపడలేదన్న విషయాన్ని గుర్తించారని సమాచారం.

ఊరేగింపు రద్దు

గత ఏడాది ఉగాది రోజున స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఈ వెండి రథంపై ఊరేగించారు. ఈ ఏడాది కొవిడ్‌ దృష్ట్యా దేవస్థానం ఊరేగింపును రద్దు చేసింది. అప్పటి నుంచి ఆ రథానికి ముసుగు వేసి ఉంచారు. ఇటీవలి కాలం వరకూ తీయలేదు. ఈ విషయంపై.. దుర్గగుడి ఈవో సురేష్‌బాబు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘గత 18 నెలలుగా వెండి రథం మల్లికార్జున మహామండపంలో ఉంది. ఆ రథానికి ఎన్ని సింహాలు ఉన్నాయో? వాటిని మరమ్మతులకు ఇచ్చారా? లాకరులో ఉన్నాయా? అన్నది పరిశీలన తర్వాతే స్పష్టమవుతుంది. దేవస్థానంలో ఉన్న వెండి, బంగారు వస్తువులు, వాహనాలకు బీమా సౌకర్యం ఉంది. పూర్తి స్థాయి పరిశీలన చేసిన తర్వాతే ఫిర్యాదు చేయాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తాం’ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : కరోనా ప్రభావం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పైపైకి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.