రైల్వే స్మార్ట్ కార్డు వినియోగదారులు నేరుగా ఆన్లైన్ ద్వారా రీఛార్జీ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి అన్ని డిజిటల్ విధానాల ద్వారా చెల్లింపులు చేయవచ్చని తెలిపింది.
గతంలో స్మార్ట్ కార్డుల రీఛార్జీ కోసం ప్రతిసారీ రైల్వే బుకింగ్ కౌంటర్లకు వెళ్లవలసి వచ్చేది. ఇప్పటికే ప్రయాణికుల సౌకర్యం కోసం యూటీఎస్ ఆన్ మొబైల్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎమ్‌లు), కరెన్సీ ఆపరేటెడ్ టికెట్ వెండింగ్ మెషిన్లు (సీఓటీవీఎమ్‌లు) వంటి అనేక డిజిటల్ పద్ధతులను ప్రవేశ పెట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇదీచూడండి: ' కొత్త నిబంధనల మేరకు ఆ పదవులకు శాశ్వత అధికారులు'