ETV Bharat / city

కొవిడ్​ ఐసోలేషన్​ కోచ్​లను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే

కరోనా రక్షిత ఐసోలేషన్​ కోచ్​లను భారతీయ రైల్వే తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వల్ప లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న కొవిడ్ రోగుల ఐసోలేషన్ కోసం అదనపు రక్షిత కోచ్​లను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రైల్వే ప్రకటించింది.

Indian Railways
కొవిడ్​ ఐసోలేషన్​ కోచ్​లను అందుబాటులోకి తీసుకొచ్చిన భారతీయ రైల్వే
author img

By

Published : Apr 25, 2021, 9:12 PM IST

కొవిడ్ రెండో దశను ఎదుర్కోవడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ కొవిడ్ రక్షిత ఐసోలేషన్ కోచ్​లను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వల్ప లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న కొవిడ్ రోగుల ఐసోలేషన్ కోసం అదనపు రక్షిత కోచ్​లను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రైల్వే ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీలో కొవిడ్ రక్షిత కోచ్​లను ఏర్పాటు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. పంజాబ్​లో వీటి ఏర్పాటు కోసం కోచ్​లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.

మరిన్ని ఐసోలేషన్ కోచ్​ల ఏర్పాటుకు రైల్వే మంత్రిత్వ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల కొవిడ్ రక్షిత కోచ్​లను ఏర్పాటు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది. దిల్లీలోని షాకూర్ బస్తీ స్టేషన్​లో 800ల పడకలతో 50 కోచ్​లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపింది. ఆనంద్ విహార్ టర్మినల్​లో 400 పడకలతో 25 కోచ్​లను, మహారాష్ట్రలోని నందూర్ బార్​లో 378 పడకలతో 21 కోచ్​లు, భోపాల్ స్టేషన్​లో 40 కోచ్​లు, పంజాబ్​లో 50 కోచ్​లు సిద్ధంగా ఉంచామని భారతీయ రైల్వే వెల్లడించింది.

ఇదీ చదవండి: 'కరోనా వైరస్​ వల్ల ప్రాణాలు పోకుండా చూడడమే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.