ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే విషయంలో పునరాలోచన లేదని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని లోకసభలో ప్రకటించింది. ప్రసుత్తం కర్మాగారంలో పని చేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరద్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి:
CM KCR Speech: 'సాగర్‌కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'