ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఇప్పటికే ఆలయంలో అనాధికారిక విగ్రహాలు ఏర్పాటుతో విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆలయ అధికారులు భద్రతను పెంచారు. ఆలయ ఆవరణలోని అన్ని పరివార దేవతా మూర్తుల ఆలయాలకు తాళాలు వేశారు.
భక్తులు ఎవరు దేవతామూర్తుల విగ్రహాల వద్దకు వెళ్లకుండా అడ్డుగా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులను నిశితంగా తనిఖీలు చేసిన తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
ఇవీ చూడండి...'అమరుల స్ఫూర్తి నిత్యం జ్వలించేలా స్మారకం ఏర్పాటు...'