రాష్ట్రంలో ఇవాళ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు... రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్- పట్టణ, వరంగల్- గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వర్షాలు పడే అవకాశముందని రాజారావు వివరించారు.
ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు (సెప్టెంబరు 20 వ తేదీన) ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉందన్నారు. ఇది రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాగల 2-3 రోజుల్లో ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని రాజారావు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: