ETV Bharat / city

Jeevan Lite: ఐఐటీ హైదరాబాద్​ పరిశోధకుల ఏడాదిన్నర కృషి ఫలితం.. "జీవన్​ లైట్​"

author img

By

Published : Mar 30, 2022, 3:09 PM IST

Jeevan Lite Ventilator: కరోనా సమయంలో వెంటిలేటర్ల కోసం ప్రజలు పడిన ఇబ్బందులు ఐఐటీ హైదరాబాద్​ పరిశోధకులను కదిలించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని సిరిల్ ఆంటోనీ, రాజేశ్​ యాదవ్ జట్టు కట్టారు. అతి తక్కువ ఖర్చుతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నదాని కంటే మెరుగైన వెంటిలేటర్​ను రూపొందించారు. "జీవన్ లైట్" పేరుతో మార్కెట్లోకి సైతం తీసుకు వచ్చారు. ఇటీవల గవర్నర్​ తమిళిసై సౌందర్​ రాజన్​ ఈ వెంటిలేటర్​ను ఆవిష్కరించి.. పుదుచ్చేరికి బహుమతిగా ఇచ్చారు. జీవన్ లైట్​ను విశ్వవ్యాప్తం చేయడం తమ భవిష్యత్ లక్ష్యం అంటున్నారు రూపకర్తల్లో ‍ఒకరైన సిరిల్ ఆంటోనీ. మరి ఈ "జీవన్​ లైట్"​ ప్రత్యేకతలేంటో చూద్దాం..

jeevan ight ventilator
జీవన్ లైట్​ వెంటిలేటర్​
ఐఐటీ హైదరాబాద్​ పరిశోధకుల ఏడాదిన్నర కృషి ఫలితం.. "జీవన్​ లైట్​"

Jeevan Lite Ventilator: కొవిడ్​ సమయంలో ఆక్సిజన్​ వెంటిలేటర్ల కోసం రోగులు పడిన అవస్థలు అన్నీఇన్నీ కావు. ఆక్సిజన్​ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనలు ఆ తెలుగు పరిశోధకులను కదిలించాయి. అందుకే సమాజానికి తమ వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. రోగులకు సులువుగా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేశారు. దానికి వారు చేసిన ఫెలోషిప్​ దోహదపడింది. తమ వద్ద ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూ ఓ వెంటిలేటర్​ను రూపొందించారు. అదే జీవన్​ లైట్​..

అలా జీవన్​లైట్​ ఆవిష్కరణకు నాంది: ఐఐటీ హైదరాబాద్​లో చదువుతున్న సమయంలో 2018లో సెంటర్​ ఫర్​ హెల్త్​కేర్​ ఇంటర్న్​షిప్​ ఆధ్వర్యంలో ఏరో బయాసిస్​ వ్యవస్థాపకులు, జీవన్​లైట్​ రూపకర్తలు సిరిల్​ ఆంటోనీ, రాజేశ్​ యాదవ్​ ఫెలోషిప్‌ మెుదలుపెట్టారు. ఏడాది కాలం శిక్షణ పూర్తైంది. ఆ తర్వాత కొత్తగా ఏదైనా పరిశోధన చేయాలనుకున్నారు. కరోనా సమయంలో ఎంతో మంది రోగులు వెంటిలేటర్​ దొరక్క.. ఆసుపత్రుల్లోని రెస్పిరేటరీ వ్యవస్థ వల్ల రోగులు పడే ఇబ్బందులను చూశారు. దీంతో వెంటిలేటర్​ సమస్యల్ని అధిగమించాలని నిర్ణయించుకున్నారు. కొవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో వెంటిలేటర్ ప్రాముఖ్యత పెరగడంతో.. వారి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే జీవన్​లైట్​. ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు.

జీవన్​లైట్​ విశేషాలు: పిల్లలు, పెద్దలు ఉపయోగించుకునేలా జీవన్​లైట్​ రూపొందించారు. వివిధ మోడ్‌లలో ఈ పరికరాన్ని ఉపయోగించేలా.. సీఎమ్‌బీ, ఎస్‌ఐఎమ్‌బీ, పీఎస్‌వీ మోడ్స్‌ వెంటిలైజేషన్‌ సౌకర్యాలు కల్పించారు. 5 వోల్టుల బ్యాటరీ బ్యాకప్‌తో.. పదివేల బ్రీత్‌ ఈవెంట్‌ లాక్‌లు ఏర్పాటు చేశారు. ఈ పరికరం చాలా సమయం పాటు సులువుగానే రోగులకు సేవలందిస్తుంది. భారతీయ వైద్యారోగ్య పరిస్థితులకు సరిపోయే విధంగా ఈ వెంటిలేటర్‌ రూపొందించారు.

ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే వెంటిలేటర్లన్నీ చాలా వరకు థెరపెటిక్ డివైజ్‌లు మాత్రమే. కానీ జీవన్‌లైట్‌ మెుత్తం ఈకో సిస్టమ్‌ను(పర్యావరణ వ్యవస్థను)కవర్‌ చేస్తుంది. రోగ నిర్ధరణతో సహా అన్ని రకాలుగా సేవలందిస్తుంది. ప్రస్తుతం నెలకు 40 నుంచి 50 యూనిట్లు జీవన్​లైట్​ వెంటిలేటర్లు​ ఉత్పత్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లోని పీహెచ్‌సీ సెటప్‌ ఏర్పాటు చేయనున్నారు. ఆర్డర్లు ఎక్కువగా వస్తే నెలకు వంద యూనిట్లకు సామర్థ్యాన్ని పెంచే యోచనలో జీవన్​లైట్​ రూపకర్తలు ఉన్నారు.

అదే మా లక్ష్యం: ఒక ఐఐటీయన్‌గా సామాజిక సమస్యలకు తమ వంతుగా పరిష్కార మార్గాలు చూపించాలని చెప్పుకొచ్చారు సిరిల్​ ఆంటోనీ. పుట్టిన కొన్ని వారాలు, నెలలు నిండిన పిల్లల కోసం ప్రత్యేకమైన వెంటిలేటర్‌ తయారీపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. తరువాత ప్రపంచ మార్కెట్‌లోకి అడుగుపెట్టి... అభివృద్ధి చెందని దేశాలకు సైతం మా డివైజ్‌లు పంపిణీ చేస్తామని చెప్పారు.

పెద్దవాళ్లకే కాకుండా అప్పుడే పుట్టిన పిల్లలకు సైతం వెంటిలేటర్లను సైతం తయారుచేసేందుకు ఈ బృందం అధ్యయనం చేస్తోంది. ప్రపంచ మార్కెట్​లోకి అడుగుపెట్టి.. అన్ని దేశాలకూ జీవన్​లైట్​ను విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

ఇదీ చదవండి: 'యాదాద్రికి మార్గం సుగమం.. ఉప్పల్​ నుంచి 100 మినీబస్సులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.