హైదరాబాద్ ప్రగతినగర్లో 20 ఏళ్ల క్రితం నిర్మించిన సాయిబాబా ఆలయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని భాజపా నేత ఆవుల సతీష్ వ్యాఖ్యలను ఆలయ ఛైర్మన్ సుధీర్ రెడ్డి ఖండించారు. కమిటీలోని సభ్యుల ఏకాభిప్రాయంతోనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని సుధీర్ రెడ్డి వెల్లడించారు.
నిరూపించకుంటే భాజపా పదవి వదులుకోవాలి..
పక్కనే ఉన్న 1000 గజాల స్థలాన్ని తాను అమ్ముకున్నానని చెప్పడం సరికాదన్నారు. నిరూపిస్తే ఆలయ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తన ఆస్తి మొత్తం ఆలయ కమిటీకే రాసిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ నిరూపించకపోతే నిజాంపేట కార్పొరేషన్ భాజపా అధ్యక్ష పదవికి ఆవుల సతీష్ రాజీనామా చేయాలని సుధీర్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : ఆ సభలో సభ్యుడిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: దానం