క్యాట్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఐఎంలో ఎంబీఏ చేయాలనేది తన లక్ష్యమని ఐసెట్‌లో మొదటి ర్యాంకు సాధించిన బి.శుభశ్రీ పేర్కొంది. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన శుభశ్రీ ఐసెట్‌లో 157 మార్కులతో మొదటి ర్యాంకు సాధించింది.
ఏపీ ఐసెట్లోనూ ఆమెకు మూడో ర్యాంకు దక్కింది. జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేసిన శుభశ్రీ.. ఐఐఎంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్‌గా అరుణ్ కుమార్ జైన్