Ice Cream Tasting Challenge: ప్రముఖ ఆన్‌లైన్ బిజినెస్ ఛానెల్ హైబిజ్ టీవీ.. ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీం టేస్టింగ్ ఛాలెంజ్ పేరుతో పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనే వారు కళ్లకు గంతలు కట్టుకుని ఐస్‌క్రీంను ఆస్వాదిస్తూ.. వాటి ఫ్లేవర్స్ పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఎక్కువ ప్లేవర్స్ పేర్లు చెప్పిన వారిని లక్ష రూపాయల బహుమతి వరిస్తుంది. ఈనెల 29న హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించే ఈ పోటీలు నిర్వహించనున్నారు.
ఈ పోటీలకు సంబంధించిన లోగోను మాసబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో నిర్వాకులు ఆవిష్కరించారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే ఆసక్తి ఉన్న వారు 150 రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించి తమ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. సరదాగా పోటీలను వీక్షించేందుకు వచ్చేవారు 100 రూపాయలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఛాలెంజ్‌లో పాల్గొనే ఐస్‌క్రీం ప్రియులు కళ్లకు గంతలు కట్టుకొని ఐస్‌క్రీం ప్లేవర్స్ రుచులను ఎవరు ఎక్కువ చెబితే వారే విజేతలవుతారని హైబిజ్ టీవీ వ్యవస్థాపకులు రాజ్‌గోపాల్ తెలిపారు. ఎక్కువ ఐస్‌క్రీం ఫ్లేవర్స్‌ను గుర్తించి ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచిన విజేతకు లక్ష రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన వారికి 50 వేల రూపాయలు, మరో 25 మంది విజేతలకు పదివేల రూపాయల చొప్పున అందజేస్తామని తెలిపారు. ఈ పోటీల్లో కేవలం ఐస్‌క్రీమ్ రుచుల పోటీలు మాత్రమే కాకుండా.. రోజంతా కుటుంబంతో ఆనందంగా, సరదాగా గడిపే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పటు చేశామని ఆయన వివరించారు.
ఇవీ చూడండి: