ETV Bharat / city

సీఎం జగన్​ ఎదుట మోకాళ్లపై ఐఏఎస్​ ప్రవీణ్​ ప్రకాశ్​.. - సీఎం జగన్​ ఎదుట మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్​ ప్రవీణ్​ ప్రకాశ్

IAS Praveen Prakash sit on knees: ఆంధ్రప్రదేశ్​లో బుధవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వేడుకలకు సీఎం జగన్​.. తన కార్యాలయ అధికారులతో హాజరయ్యారు. కుర్చీలో జగన్ ఆసీనులయ్యారు. ఈ క్రమంలో సీఎం పిలవగానే వచ్చిన ఆయన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్​ ప్రకాశ్.. మోకాళ్లపై కూర్చొని సమాధానమిచ్చారు. కెమెరా కంటికి చిక్కిన ఆ దృశ్యాలు.. ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారాయి.

IAS Praveen Prakash sit on knees
జగన్​ ఎదుట మోకాళ్లపై ప్రవీణ్​ ప్రకాశ్​
author img

By

Published : Jan 27, 2022, 12:23 PM IST

Updated : Jan 27, 2022, 1:04 PM IST

IAS Praveen Prakash sit on knees: సివిల్​ సర్వెంట్లు అంటే అది ఎంత ఉన్నతమైన ఉద్యోగమో మనకు తెలిసిందే. ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వారిది కీలక పాత్ర. ప్రభుత్వాన్ని నడిపించే పాలకులు సైతం.. వారి సూచనల మేరకే నడుచుకుంటారు. అలాంటి ఐఏఎస్​ అధికారులు.. ప్రజాప్రతినిధుల ముందు వినయం ప్రదర్శిస్తే అది చూసే సాధారణ ప్రజలకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కారణమేదైనా కావొచ్చు.. అత్యున్నత స్థాయిలో ఉండే సివిల్​ సర్వెంట్లు ఇలా ప్రవర్తించడమేంటని సందేహం రాక మానదు. ఏపీలో బుధవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో జరిగిన ఓ పరిణామం మళ్లీ ఈ అనుమాన్ని రేకెత్తిస్తోంది. అసలేం జరిగిందంటే..

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ఐఏఎస్‌ అధికారులు పాల్గొన్నారు. ముందు వరుసలో సీఎం.. అధికారులు ఆయన వెనుక కూర్చొన్నారు. ఈ సందర్భంగా ఏదో అంశంపై మాట్లాడేందుకు సీఎం జగన్‌ పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడారు. అంతమంది ప్రముఖుల మధ్యలో ఓ ఐఏఎస్​ అధికారి.. అలా మోకాళ్లపై కూర్చొని మాట్లాడటం పలు చర్చలకు తావిస్తోంది. ఆ దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి.

కాగా కొన్ని నెలల క్రితం సైతం తెలంగాణలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాలో నూతన కలెక్టరేట్​ ప్రారంభోత్సవంలో అప్పటి కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి.. సీఎం కేసీఆర్​ కాళ్లకు మొక్కడం పలు చర్చలకు దారి తీసింది.

ఇదీ చదవండి : మంత్రుల కోటాలో రైల్వే ఉద్యోగాలిప్పిస్తామంటూ.. కోట్లు స్వాహా

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 27, 2022, 1:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.