ETV Bharat / city

ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులకు పదోన్నతులు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

పదోన్నతులు
author img

By

Published : Apr 23, 2019, 9:05 PM IST

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​లు ప్రమోషన్లు పొందారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్య కార్యదర్శులుగా ఉన్న అదర్ సిన్హా, శాలినీమిశ్రా, సోమేశ్ కుమార్​లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆర్.ఆర్.మిశ్రా, వసుధా మిశ్రా, రాణి కుమిదినికి కూడా ప్రమోషన్​ లభించింది. సవ్య సాచిఘోష్​కు ముఖ్య కార్యదర్శిగా యోగితా రాణా, లోకేష్ కుమార్, టి.విజయ్ కుమార్, పి.సత్యనారాయణరెడ్డిలకు సూపర్ టైం స్కేల్​కు పదోన్నతులు లభించాయి.

చంపాలాల్, భారతి లక్ పతి నాయక్, విజయేంద్ర, కె.వై.నాయక్, సురేంద్ర మోహన్, రోనాల్డ్ రోస్​లకు సెలెక్షన్ గ్రేడ్ స్కేల్​కు ప్రమోషన్​ కల్పించారు. డి. దివ్య, భారతి హోళికేరి, హరిచందన, ప్రీతిమీనా, అమ్రపాలి కాటాలకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్​కు పదోన్నతులు దక్కాయి. అనురాగ్ జయంతి, గౌతమ్, పమేలా సత్పథి, రాహుల్ రాజ్ లకు సీనియర్ టైం స్కేల్​కు పదోన్నతి కల్పించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఐపీఎస్​లకు కూడా

అటు 23 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మోహంతి, మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్‌, తూర్పు మండలం డీసీపీ రమేశ్​కు సంయుక్త కమిషనర్‌లుగా పదోన్నతి లభించింది. వి.శివకుమార్‌, వి.బి.కమలాసన్‌రెడ్డి, ఎస్‌.చంద్రశేఖర్‌, ఏఆర్‌ శ్రీనివాస్‌ డీఐజీలుగా, అకున్‌ సబర్వాల్‌, సుధీర్‌బాబు, టి.ప్రభాకర్‌రావు, ప్రమోద్‌కుమార్‌ ఐజీలుగా, కె.శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, సౌమ్య మిశ్ర, షిక గోయల్‌, అభిలాష బిస్తలకు అదనపు డీజీలుగా పదోన్నతులు పొందారు. ఇవీ చూడండి: లారీ నిండా బాంబులు- శ్రీలంకలో హైఅలర్ట్​

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.