ETV Bharat / city

హెలికాఫ్టర్​తో వాయుసేన రెస్క్యూ ఆపరేషన్.. 11మంది సేఫ్

అనంతపురం జిల్లాలో వాయుసేన సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టారు. చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మందిని హెలీకాఫ్టర్​ సహాయంతో కాపాడారు. వాయుసేన అధికారులు హెలికాఫ్టర్ సాయంతో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

helicopter
helicopter
author img

By

Published : Nov 19, 2021, 4:35 PM IST

హెలికాఫ్టర్​తో వాయుసేన రెస్క్యూ ఆపరేషన్.. 11మంది సేఫ్

రెండు మూడు రోజుల నుంచి ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనంతపురంలోని చిత్రావతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద 11 మంది ఆ నదిలో చిక్కుకుపోయారు. వాయుసేన అధికారులు హెలికాఫ్టర్ సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.

తీరం దాటిన వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం..పుదుచ్చేరి - చెన్నై మధ్య తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 3-4 గంటల మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. వేలూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 60 కి.మీ. దూరంలో, పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వాయుగుండం బలహీనపడనున్నట్లు వెల్లడించారు. రాగల 6 గంటల్లో అది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని స్పష్టం చేశారు.

పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rain In AP) కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా పెదమాండ్యంలో అత్యధికంగా 19.9 సెంటిమీటర్లు నమోదు కాగా... కడప జిల్లా పులివెందులలో 16.9, అనంతపురం జిల్లా నల్లచెరువులో 17.1 సెంటిమీటర్ల వర్షం కురిసింది. చిత్తూరు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

స్వర్ణముఖి నదికి వరద ఉద్ధృతి

స్వర్ణముఖి నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఏర్పేడు, చంద్రగిరి మండలలాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు చేరింది. మునగాలపాలెం, కొత్త వీరాపురం, చెన్నంపల్లితో పాటు పరిసర గ్రామాలు నీట మునిగాయి. కాళంగి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తుండటంతో జయలక్ష్మీపురం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ప్రవాహానికి రహదారులు కొట్టుకుపోయాయి. నరసింగాపురం - చంద్రగిరి మార్గంలో ఉన్న వంతెన కుప్పకూలింది. అర్ధరాత్రి జరగడంతో ప్రమాదం తప్పింది. మరో దారి లేకపోవడంతో రాకపోకలు స్తంభించాయి. చౌదసముద్రం-కలువపల్లే రహదారి తెగి రాకపోకలు నిలిచిపోయాయి. చిత్తూరు జిల్లా గాజులమన్యంలో వరద నీటిలో చిక్కుకున్న 69మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడాయి.

సురక్షిత ప్రాంతాలకు బాధితులు...

తిరుపతి గ్రామీణ మండలంలో స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదిలో గల్లంతైన ఐదుగురు ముళ్లపూడి వాసులను గ్రామస్థులు రక్షించారు. చిగురువాడ వద్ద వంతెన కూలింది. ఈ ఘటనలో శివాలయం కూడా దెబ్బతింది. ఎగువ ప్రాంతాల నుంచి కల్యాణి జలాశయానికి వస్తున్న వరద తగ్గింది. నీటిమట్టం 889అడుగులకు చేరడంతో అధికారులు మూడు గేట్లు మూసివేశారు. మదనపల్లె మండలంలోని వలసపల్లిలో మొరం చెరువుకు గండి పడింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లి వద్ద రహదారి దెబ్బతింది. వెదురుకుప్పం-దేవలంపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చంద్రగిరి-శ్రీనివాసమంగాపురం మార్గంలో వంతెన కూలడంతో చంద్రగిరి పరిసర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఇదీ చదవండి: ఇది గౌర‌వ స‌భా.. కౌరవ స‌భా... ఏడ్చిన చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.