ETV Bharat / city

ఇక నుంచి పరిశోధన సులభం.. గంటల్లో చేసే పని నిమిషాల్లోనే.!

author img

By

Published : Mar 27, 2022, 9:19 AM IST

Opensource website for researches: ఏదైనా ఒక అంశంపై పరిశోధన చేయాలంటే.. అందుకు తగిన సమాచారం చాలా అవసరం. ఎన్నో పుస్తకాలు తిరగేస్తే కానీ మనకు కావాల్సింది దొరకదు. అంతర్జాలం పుణ్యమా అని ప్రతీ సమాచారం అరచేతిలోనే దొరుకుతున్నా.. సమయం మాత్రం ఎక్కువగానే వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఆ సమయాన్ని తగ్గించేందుకు హైదరాబాద్‌కు చెందిన శ్రేష్ఠ వినూత్నంగా ఆలోచించింది. ఓ వెబ్‌సైట్‌ రూపొందించింది.

wవెచ్‌ searching tool
wవెచ్‌ searching tool

Opensource website for researches: ఒక అంశంపై పరిశోధన చేయాలంటే లోతైన అధ్యయనం అవసరం. అందుకు అనుగుణంగా పరిశోధకులు అనుబంధంగా ఉండే అంశాలను పరిశీలిస్తూ.. రిఫరెన్స్‌ పుస్తకాల్లో వెతుకుతూ, అంతర్జాలంలో శోధిస్తుంటారు. ఇందుకు వారు రోజుకు ఐదారుగంటలు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే.. ఐదు నిమిషాల్లోనే అవసరమైన సమాచారాన్ని సేకరించే వెబ్‌ సెర్చింగ్‌టూల్‌ను రూపొందించింది హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థిని కె.శ్రేష్ఠ. పరిశోధకులకు అవసరమైన అంశాలను ఆయా కీవర్డ్స్‌ ద్వారా ఇందులో వెతికితే ఐదు నిమిషాల్లోనే వారికి అవసరమైన సమాచారం లభ్యమవుతోంది.

ఇస్రోలో ఇంటర్న్‌షిప్‌కోసం ఎంతో మంది దరఖాస్తు చేసుకోగా... పరిధి దాటి వినూత్న ఆలోచనలు చేసే (ఔటాఫ్‌ ది బాక్స్‌) ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే ఆలోచనలున్నవారిని ఎంపిక చేయగా.. అందులో శ్రేష్ఠకు అవకాశం లభించింది. ఈ క్రమంలో 2021 మే 4 నుంచి ఐదు నెలలపాటు వర్చువల్‌గా సాగిన ఇంటర్న్‌షిప్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా వేలాది పరిశోధన పత్రాల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించే పని అప్పగించారు. దీనికి ఎంతో సమయం కేటాయించాల్సి వచ్చేది. అప్పుడే ఈ సెర్చింగ్‌టూల్‌ రూపొందించాలన్న ఆలోచన కలిగిందని శ్రేష్ఠ తెలిపింది. డేటా సేకరణ కోసం సెలేనియం, బ్యూటిఫుల్‌సోప్‌ను వినియోగించారు. సుమారు ఐదు నెలలు శ్రమించిన అనంతరం పరిశోధకులకు ఉపయోగపడే ఓపెన్‌సోర్స్‌ వెబ్‌సైట్‌ రూపొందిందని పేర్కొంది. ఇందుకోసం తన అధ్యాపకులు ఎంతో సహాయం అందించారని శ్రేష్ఠ వివరించింది.

ఇదీ చదవండి: Group1 Notification: ఉగాది తర్వాతే గ్రూప్‌-1 నోటిఫికేషన్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.