Hyderabad Roads: సంక్రాంతి సందర్భంగా పల్లెలు కళకళలాడుతున్నాయి. ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇంటికొచ్చిన బంధుగణంతో సందడిగా మారాయి. అదే సమయంలో భాగ్యనగరం బోసిపోయింది. రాత్రి పగలూ తేడా లేకుండా రద్దీగా ఉంటే నగర రహదారులు.. ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి సంబురాలను సొంతూళ్లో నిర్వహించుకొనేందుకు.. నగరవాసులంతా క్యూ కట్టడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారులు, కూడళ్లు, వ్యాపార సముదాయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి.
సంవత్సరం పొడువుగా రద్దీగా ఉండే రోడ్లు ఒక్కసారిగా ఖాళీగా కనిపిస్తుండడంతో.. పలువురు వాహనదారులు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి, లక్డీకపూల్, రాజ్‌భవన్, అసెంబ్లీ రోడ్లు, నెక్లెస్‌రోడ్, అమీర్‌పేట్, పంజాగుట్ట, మాదాపూర్, శిల్పారామం, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.