ETV Bharat / city

వర్షాలతో హిమాయత్​సాగర్​లోకి 4.44లక్ష క్యూసెక్కుల ఇన్​ఫ్లో

వర్షాలతో హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​కు భారీగా వరద నీరు వచ్చి చేరినట్టు హైదరాబాద్ జలమండలి ఎండీ దాన కిషోర్​ తెలిపారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్​తో కలిసి హిమాయత్​సాగర్​ను సందర్శించారు.

hyderabad jalamandali md dhana kishore visit himayatsagar
వర్షాలతో హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​కు భారీగా నీరు: దాన కిషోర్
author img

By

Published : Oct 17, 2020, 8:33 PM IST

ఇటీవల కురిసిన వర్షాలతో హిమాయత్​సాగర్ జలాశయంలోకి 4.44 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చినట్టు జలమండలి ఎండీ దానకిషోర్ వెల్లడించారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్​తో కలిసి దానకిషోర్​ సందర్శించారు. గేట్లు ఎత్తి 4.39 లక్షల క్యూసెక్కుల నీటిని మూసిలోకి వదిలినట్టు తెలిపారు. నీటి విడుదల సమయంలో లోతట్టు ప్రాంతవాసులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించారు. వర్షాలతో హిమాయత్​సాగర్​తో పాటు, ఉస్మాన్​సాగర్​లోకి కూడా భారీగా వరద నీరు వస్తోందన్నారు.

పాతబస్తీలోని బహదూర్​పుర నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో దాన కిషోర్ పర్యటించారు. హషామాబాద్, అల్జుబైల్ కాలనీ, కబీర్​నగర్​, గాజీమిల్లత్​ కాలనీల్లో పర్యటించి తాగునీటి సరఫరా, వాటర్ ట్యాంకర్లు, క్లోరిన్ మాత్రల పంపిణీల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో పైపులైన్లు ధ్వంసం అయిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.