అత్యవసర సేవల విభాగంలోకి వచ్చే వ్యాపార సంఘాల ప్రతినిధులతో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సమావేశమయ్యారు. వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీపీ అవగాహన కల్పించారు. కూరగాయలు, పాలు, ఇతర వస్తువులను నిర్దేశించిన సమయంలోనే విక్రయించాలని సూచించారు.
ఇష్టారీతిన వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.
ఇవీచూడండి: నిత్యావసర వస్తువుల సరఫరాపై అధికారులతో మంత్రి ఈటల భేటీ