ETV Bharat / city

పెళ్లికి చినిగిన షేర్వాణి... దుకాణదారుడికి రూ.50 వేల ఫైన్ - consumer forum imposed fine to origins

కుమార్తె పెళ్లిని ఘనంగా నిర్వహించిన ఓ న్యాయవాది.. అల్లుడి కోసం ఖరీదైన షేర్వాణి కొనుగోలు చేశారు. బరాత్ సందర్భంగా షేర్వాణి ధరించేందుకు సిద్ధమైన పెళ్లి కొడుకుకి.. తీవ్ర నిరాశ ఎదురైంది. తన మామ కొన్న షేర్వాణి భుజాల వద్ద చినిగి ఉంది. బంధువులు అప్పటికప్పుడు పరిగెత్తి మరో డ్రెస్ కొనుక్కొచ్చారు. పెళ్లింట తనకు అవమానంగా భావించిన న్యాయవాది.. షేర్వాణి అమ్మిన దుకాణంపై వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. ఫోరం ఏం చేసిందో.. ఈ కథనంలో చూద్దాం..

hyderabad consumer forum imposed fine to cloth store who deliver Torn shervani
పెళ్లికి చినిగిన షేర్వాణి... దుకాణదారుడికి రూ.50 వేల ఫైన్
author img

By

Published : Aug 3, 2020, 5:20 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్​కు చెందిన న్యాయవాది కిశోర్ రాయ్.. గతేడాది డిసెంబరు 1న తన కుమార్తె పెళ్లిని ఘనంగా జరిపారు. అందులో భాగంగా తన అల్లుడి కోసం బంజారాహిల్స్ రోడ్ నంబరు4లో ఆరిజిన్స్ దుకాణంలో రూ.83 వేలతో షేర్వాణి, మరో ఐదు దుస్తులు కొనుగోలు చేశారు. పెళ్లయిన తర్వాత బరాత్ కోసం పెళ్లి కొడుకు... కొత్త షేర్వాణి వేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే భుజాల వద్ద షేర్వాణి చినిగి కనిపించడంతో.. నిరాశకు గురయ్యారు. మరోవైపు బరాత్ కోసం బందువులందరూ ఎదురు చూస్తుండటంతో.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పెళ్లి కొడుకు సోదరుడు సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లి మరో డ్రెస్ కొనుగోలు చేసి.. బరాత్ అయిందనిపించారు.

స్పందించని దుకాణ యాజమాన్యం

షేర్వాణి చినిగి ఉండటం.. పెళ్లి బృందంలో అందరినీ ఇబ్బంది పెట్టింది. దీంతో బంధువుల ముందు కిశోర్ రాయ్​కి అవమానకరంగా, ఇబ్బందిగా అనిపించింది. రెండు రోజుల తర్వాత డిసెంబరు 3న తనకు చినిగిన షేర్వాణి ఇచ్చినందుకు.. ఆరిజిన్స్ యజమానికి లీగల్ నోటీసు ఇచ్చారు. షాపు యాజమాన్యం నోటీసులకు స్పందించలేదు. దీంతో తాను చెల్లించిన రూ.83వేలతో పాటు... రూ.10లక్షలు పరిహారం చెల్లించేలా ఆరిజిన్స్​ను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ జిల్లా మూడో వినియోగదారుల ఫోరాన్ని కిశోర్ ఆశ్రయించారు. వివరణ ఇవ్వాలని వినియోగదారుల ఫోరం నోటీసులు పంపించినప్పటికీ.. ఆరిజిన్స్ నుంచి స్పందన రాలేదు. కిశోర్ సమర్పించిన పలు ఆదారాలు, కొత్త వినియోగదారుల చట్టంలోని పలు సెక్షన్లను పరిశీలించిన వినియోగదారుల ఫోరం తీర్పు వెల్లడించింది.

పెళ్లి బృందానికి వెలకట్టలేని చేదు అనుభవం

సరిగా కుట్టకుండా షేర్వాణి ఇవ్వడం ఆరిజిన్స్ నిర్లక్ష్యమేనని.. సేవా లోపమేనని వినియోగదారుల ఫోరం తేల్చింది. పెళ్లిలో జరిగిన ఆ ఘటన కొత్త జంటతో పాటు.. వారి కుటుంబ సభ్యులందరికీ వెలకట్టలేని చేదు అనుభవమని వ్యాఖ్యానించింది. కాబట్టి కిశోర్ రాయ్ చెల్లించిన రూ.83వేలు తిరిగి చెల్లించాలని ఆరిజిన్స్​ను ఫోరం ఆదేశించింది. మానసిక ఆందోళన కలిగించినందుకు మరో రూ.50వేలు, పిటిషన్ ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. నలభై ఐదు రోజుల్లో చెల్లించకపోతే... ఆ తర్వాత 18 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇవీచూడండి: క్యాష్‌ బ్యాక్ ఆఫర్ చెల్లలేదని రూ.5 వేల జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.