ETV Bharat / city

హైదరాబాద్‌ హై అలర్ట్‌... రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు - హైదరాబాద్‌ వర్షాలు

Hyderabad rains
Hyderabad rains
author img

By

Published : Sep 26, 2021, 9:52 PM IST

Updated : Sep 26, 2021, 10:46 PM IST

21:47 September 26

హైదరాబాద్‌ హై అలర్ట్‌... రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు హైదరాబాద్‌ నగరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్‌ఎంసీ కూడా అప్రమత్తమైంది. ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు జీహెచ్ఎంసీ విపత్తుల నిర్వహణ విభాగం హై అలర్ట్‌ ప్రకటించింది. జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హెచ్‌ఓడీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర బృందాలను సిద్దంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. 

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్ర స్థాయిలో సిబ్బందిని సిద్దంగా ఉంచుకోవాలని, ఫోన్‌ కాల్స్‌కు తక్షణమే స్పందించేట్లు చూడాలన్నారు. పడవలు, పంపులు, ఇతర అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. గత అనుభవాల ఆధారంగా వరద అత్యవసర పరిస్థితిని అంచనా వేసుకోవాలని, లోతట్టు ప్రాంతాలను తనిఖీ చేసేట్లు, నీటి నిలువలను ఎప్పటికప్పుడు ఎత్తి పోసేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని వివరించారు. వీక్ ఆఫ్‌లు, సెలవులు వారంపాటు పరిమితంగా ఉండేట్లు చూసుకోవాలని, సిబ్బంది అందుబాటులో ఉండేట్లు చూడాలని పేర్కొన్నారు. 

ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా పునరావాస కేంద్రాలను ముందే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అక్కడ ప్రాథమిక సౌకర్యాలు ఎలా ఉన్నాయో ముందే నిర్ధారించుకోవాలని, రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. వరదలు, లోతట్టు ప్రాంతాల గురించి ఆయా ప్రాంతాల ప్రజలను హెచ్చరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి : Cyclone Gulab: గులాబ్‌ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభం

Last Updated : Sep 26, 2021, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.