వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసీ, 4 లెగ్ ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో 'అడాప్ట్ ఏ పెట్' పేరుతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు డాగ్ లవర్స్ పాల్గొన్నారు.
నగరంలో వీధి కుక్కల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని స్టెరిలైజేషన్ చేసి దత్తత ఇస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ముందుకురావాలని కోరారు. దత్తత తీసుకునేందుకు ఆధార్ సహా పలు వివరాలు సమర్పించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు.
ఇవీచూడండి: వైభవంగా గాయని సునీత వివాహం