ETV Bharat / city

భార్య ప్రాణాలు తీసి.. ఆపై ఆత్మహత్యాయత్నం - husband murder his wife latest news update

అనుమానం పెనుభూతంగా మారి ఒకరి ప్రాణాలు బలికొనగా... మరొకరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వీకోట మండలం పముగానిపల్లెలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కర్కశంగా కొడవలితో నరికి చంపి.. తరువాత తాను గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

husband-commits-suicide-after-murder-his-wife-at-chittoor-district
భార్య ప్రాణాలు తీసి.. అటుపై ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 27, 2020, 6:57 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా వీకోడ మండలం పముగానిపల్లెలో భర్త భార్యను దారుణంగా కొడవలితో నరికి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. పముగానిపల్లెకి చెందిన ప్రభాకర రెడ్డి మద్యానికి బానిసై కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు. అనుమానంతో తరుచూ గొడవ పడే అతను.. భార్యతో ఘర్షణకు దిగి.. ఆ కోపంలో భార్య రేణుకను కొడవలితో నరికి చంపాడు.

అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచిన రేణుక మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి : యాదాద్రి ఆలయంలో నిబంధనల ఉల్లంఘన.. వంతపాడుతున్న ఈవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.