రాష్ట్రంలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం చేయాలన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునకు విశేష స్పందన వచ్చింది. తమ వంతు సాయం చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి.
దివ్యాంగుల సంస్థకు చెందిన డాక్టర్ బి.విజయ్‌భాస్కర్ గౌడ్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పేరున రూ.1 లక్ష చెక్కును గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఆ చెక్కును ఐఆర్‌సీఎస్‌కు పంపించారు.
వర్షం, వరద ప్రభావిత ప్రాంత ప్రజల కోసం మందులను విరాళంగా ఇచ్చారు. మణిదీప్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున దుప్పట్లను అందజేశారు. వరద బాధిత ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ విజయ భాస్కర్ గౌడ్, మణిదీప్ సంస్థల సేవలను గవర్నర్ ప్రశంసించారు.
ఇవీచూడండి: భాగ్యనగరంలో బీభత్సం.. ప్రతి ఒక్కరు సాయం చేయండి: గవర్నర్