ETV Bharat / city

విద్యార్థులపై కరోనా ప్రతాపం... ఒక్కరోజే 83కు పైగా కేసులు - corona cases in hyderabad

పాఠశాలలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి సోకుతూ... భయబ్రాంతులకు గురిచేస్తోంది. అటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇవాళ ఒక్కరోజే 83 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొవిడ్​ సోకిందంటే... పాఠశాలలపై మహమ్మారి తీవ్రత ఎంతవుదో అర్థమవుతోంది.

huge number of  corona cases in telangana schools

author img

By

Published : Mar 16, 2021, 8:57 PM IST

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది... ఇక పాఠశాలలు తెరవచ్చని నిర్ధారించుకున్న సర్కారు... కఠిన నిబంధనలతోనే విద్యాలయాలకు అనుమతించింది. అటు పాఠశాలల యాజమాన్యాలు సైతం నిబంధనలు పాటిస్తూ సర్కారు చెప్పిన నియమాలతో విద్యార్థులకు బోధన ప్రారంభించాయి. సుమారు ఏడాది పాటు విద్యాలయాలకు దూరమైన పిల్లలు... తరగతుల్లోకి అడుగుపెట్టి పక్షం రోజులు గడిచాయో లేదో... మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి సోకుతూ... భయాందోళనలు రేకెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో కేవలం ఒక్క రోజే 83 కేసులు నమోదై... కరోనా కలకలం సృష్టిస్తోంది.

మైనారిటీ గురుకుల పాఠశాలల్లో...

హైదరాబాద్ నాగోల్ బండ్లగూడాలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 36 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్​గా తేలింది. 169 మంది విద్యార్థినిలు ఉన్న ఈ హాస్టల్​లో... కొంతమంది అస్వస్థతకు గురవగా... పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను 5 వ అంతస్తులో ఐసోలేషన్​లో ఉంచినట్లు తెలిపిన అధికారులు... లక్షణాలు ఎక్కువైతే బాధితులను గచ్చిబౌలిలోని కిమ్స్​కి తరలిస్తామన్నారు. నెగిటివ్ వచ్చిన విద్యార్థులను సైతం 14 రోజులు క్వారెంటైన్​లో ఉంచనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లోని మిగతా విద్యార్థులకు సైతం కొవిడ్​ పరీక్షలు చేస్తున్నారు. భయంతో కొంత మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వగా... తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న కలెక్టర్​... విద్యార్థులకు ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేయాలని ఆదేశించారు.

టేక్రియాల్​ కేజీబీవీలో...

కామారెడ్డి టేక్రియాల్‌ కస్తూర్బాగాంధీ పాఠశాలలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. పాఠశాలలోని 140 మందికి పరీక్షలు నిర్వహించగా... 32 మంది విద్యార్థులకు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇందులో 25 మంది విద్యార్థులుండగా... మిగతా ఏడుగురు సిబ్బందికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులను ఐసోలేషన్​, హోం క్వారైంటన్​లో ఉంచినట్లు తెలిపారు.

మంచిర్యాలలో మరో 15 మందికి...

మంచిర్యాల జిల్లాలోని బాలికల ఉన్నత పాఠశాలపై మహమ్మారి ప్రతాపం కొనసాగుతోంది. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 14 మందికి పాజిటివ్​ రాగా... పాఠశాలలోని 80 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మరో 15 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వీటితో పాఠశాలలో ఇప్పటివరకు 29 మందిలో వైరస్ సోకినట్లయింది.

తల్లిదండ్రుల్లో భయం...

పాఠశాలల్లో వైరస్ కలకలం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించడానికి భయపడుతున్నారు. వసతిగృహాల్లో ఉన్న విద్యార్థులను తమ ఇళ్లకు తిరిగి తీసుకెళ్లిపోతున్నారు. అన్ని నిబంధనలు పాటిస్తూ... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలకు కరోనా సోకటం పట్ల యాజమన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చూడండి: టేక్రియాల్ కేజీబీవీలో కరోనా కలకలం... 32 మందికి పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.