ETV Bharat / city

అవసరంలేని స్కానింగ్‌తో కొత్తరోగాలొచ్చే ప్రమాదం

కరోనా మహమ్మారి ఒంటినే కాకుండా ఇంటినీ గుల్ల చేస్తోంది. ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుంటున్న పలు డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు... టెస్టుల పేరుతో వేలకువేలు వసూలు చేస్తున్నాయి. కరోనా రెండో దశ వ్యాప్తితో ఇటీవల హెచ్​.ఆర్​. సీటీ పరీక్షల కోసం పరుగులు తీస్తున్నవారు ఎక్కువవుతున్నారు. నిజంగా హెచ్​.ఆర్​ సీటీ కొవిడ్‌ని నిర్ధారిస్తుందా...? ఈ రకం స్కాన్‌లు శరీరంపై చూపే ప్రభావం... ఈ స్కానింగ్‌ ఎవరికి అవసరం అనే అంశాలపై ప్రత్యేక కథనం.

అవసరంలేని స్కానింగ్‌తో కొత్తరోగాలొచ్చే ప్రమాదం
అవసరంలేని స్కానింగ్‌తో కొత్తరోగాలొచ్చే ప్రమాదం
author img

By

Published : May 5, 2021, 6:55 PM IST

Updated : May 5, 2021, 7:25 PM IST

జలుబు, దగ్గు ఉందా... అయితే కరోనానే అయింటుంది. హెచ్​.ఆర్​ సీటీ చేయిద్దాం.... అనే వైద్యులు కొందరు. మా ఇంట్లో ఒకరికి పాజిటివ్.. నేను కూడా సీటీ చేయించుకుంటే ఆందోళన తగ్గుతుందనుకునే ప్రజలు కొందరు. ఇలాంటి పరిస్థితుల్లో... కొవిడ్ పుణ్యమా అని సీటీ స్కాన్‌లకు ఇటీవల డిమాండ్‌ బాగా పెరిగింది. టెస్టుల కోసం ల్యాబ్‌లు, ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో ప్రజల ఆందోళనలను ఆసరాగా చేసుకుంటూ... చాలా ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు వేలకువేలు గుంజుతున్నాయి. కొన్ని డయాగ్నోస్టిక్ ల్యాబుల్లో అయితే కనీసం వైద్యుడి సలహా లేకుండానే సీటీలు చేస్తున్నారు. ఏడాది క్రితం వరకు కేవలం 4వేల నుంచి నాలుగున్నర వేల రూపాయల వరకు ఉన్న సీటీ స్కాన్‌కు... ఇప్పుడు ఏకంగా రూ.8 వేల నుంచి రూ.12వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కో టెస్టుకు రెండు నుంచి మూడింతల ధరలు పెంచుతున్నారు. కరోనా వేళ డిమాండ్ సీటీతోనే మేలు జరుగుతుందన్న ఆలోచనే ఇందుకు కారణమవుతోంది.

వారికి మాత్రమే అవసరం..

వాస్తవానికి హెచ్​.ఆర్​. సీటీ ప్రతి ఒక్కరికి అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా తీవ్ర లక్షణాలు ఉండి, మందులు వాడినప్పటికీ ప్రభావం తగ్గకుండా... రోజురోజుకీ సమస్య పెరుగుతున్న వారికి మాత్రమే సీటీ అవసరం ఉంటుంది. అలాంటి వారిలో చెస్ట్ ఎక్స్ రే, రక్తంలోని గడ్డలను గుర్తించేందుకు డీ-డైమర్ వంటి కొన్ని రకాల బ్లడ్‌టెస్టులతో పాటు సీటీ చేయటం ద్వారా వైరస్ తీవ్రతను గుర్తించి, ప్రాణాపాయం లేకుండా కాపాడవచ్చు. స్వల్పలక్షణాలు, అసింప్టిమేటిక్ వారికి కేవలం యాంటీజెన్, ఆర్టీపీసీఆర్​ పరీక్షల్లోనే వైరస్ నిర్ధారణ అవుతున్న తరుణంలో సీటీ వంటి పరీక్షలు చేయించుకోవటం వృథా ప్రయాస మాత్రమే కాదు.. ఇలాంటి పరీక్షలు శరీరంపై దీర్ఘ కాలిక ప్రభావాన్ని చూపే ప్రమాదం లేకపోలేదు. 300 ఎక్స్‌రేలతో సమానమైన తీవ్రత ఒక్క సీటీతోనే ఉండటం... ఈ రేడియేషన్‌తో భవిష్యత్తులో మహిళల్లో అయితే చెస్ట్, థైరాయిడ్, ఒవేరియన్ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పురుషుల్లోనూ అనేక రకాల క్యాన్సర్​లతో పాటు... దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆత్మ స్థైర్యంతో ఎదుర్కోవాలి..

కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరూ సీటీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అత్యవసరమైన వారికి మాత్రమే వైద్యులు ఈ టెస్టులను సూచించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు సైతం అనవసరపు ఆందోళనకు గురికాకుండా కరోనాను ఆత్మ స్థైర్యంతో ఎదుర్కోవాలని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: సూది మందు పంపుతామని.. చుక్కలు చూపుతున్నారు

Last Updated : May 5, 2021, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.