ETV Bharat / city

హోంగార్డు దాడి.. యువకుడికి గాయాలు - హోంగార్డు దాడి.. యువకుడికి గాయాలు

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓయువకుడిని ఆపినందుకు హోంగార్డుకు, యువకుడికి జరిగిన ఘర్షణలో యువకుడి కంటికి గాయమైన ఘటన గోల్కొండ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

Homeguard attack on young man
హోంగార్డు దాడి.. యువకుడికి గాయాలు
author img

By

Published : Apr 28, 2020, 10:00 PM IST

గోల్కొండ పోలీస్ స్టేషన్​ పరిధిలోని షేక్​పేట్​ చెక్​పోస్డు వద్ద హనుమంతు అనే హోంగార్డు విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా హెల్మెట్ లేకుండా వచ్చిన ఓ ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్నాడు. ద్విచక్ర వాహనం నడుపుతున్న జైదన్ అహ్మద్ (19) అనే యువకుడికి, హోంగార్డుకు మాటా మాటా పెరిగింది. హోంగార్డు ఆ యువకుడిని లాఠీతో కొట్టాడు. అది పొరపాటున జైదన్ అహ్మద్ కంటికింద తాకి తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కంటి కింద దెబ్బ బలంగా తాకడం వల్ల మూడు కుట్లు వేసినట్లు యువకుడి బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.