ETV Bharat / city

'నిర్లక్ష్యమే వైద్యురాలి ప్రాణం తీసింది'

పశు వైద్యురాలి హత్య కేసులో పోలీసులు సకాలంలో స్పందించలేదని ఐఎంఏ సభ్యులు ఆరోపించారు. హైదరాబాద్ అబిడ్స్​లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఎంఎ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.శంతను సేన్ పాల్గొన్నారు.

"సహాయం కోసం నిస్సహాయస్థితిలో ఎదురుచూసింది"

author img

By

Published : Dec 1, 2019, 8:25 PM IST

శంషాబాద్​లో పశు వైద్యురాలి దారుణ హత్యను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే యువతి బతికి ఉండేదని.. ఐఎంఎ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.శంతను సేన్ అన్నారు. హైదరాబాద్ అబిడ్స్​లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. వెటర్నరీ డాక్టర్ మరణం దేశప్రజాలందరిని కన్నీరు పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"సహాయం కోసం నిస్సహాయస్థితిలో ఎదురుచూసింది"

అడుగడుగునా నిర్లక్ష్యమే...

జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగితే.. అక్కడి భద్రతా సిబ్బంది స్పందించకపోవడం దారుణమని శంతను సేన్ అన్నారు. ఆ సమయంలో సహాయం కోసం నిస్సహాయస్థితిలో ఎదురుచూసిందని.. కానీ తెల్లవారే వరకు ఒక్క పోలీస్ పెట్రోలింగ్ వాహనం రాకపోవడం ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'అమానవీయ ఘటన విని నిద్రలేని రాత్రి గడిపా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.