ETV Bharat / city

పోలీసుల ప్రొటోకాల్​.. ట్రాఫిక్​ డ్యూటీలో డాక్టర్​.. హోంమంత్రి ఫైర్​..! - Home Minister Mahmood Ali Fire on masabtank traffic police

ప్రొటోకాల్​ కోసం పోలీసులు ట్రాఫిక్​ను కాసేపు ఆపేస్తే.. వైద్యులు ఆ ట్రాఫిక్​ను నియంత్రించిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. ఈ ఘటన కాస్తా... హోం మంత్రి మహమూద్​ అలీ దృష్టికి చేరటంతో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై హోంమంత్రి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారంటే...?

home-minister-mahmood-ali-fire-on-masabtank-traffic-police

author img

By

Published : Jul 24, 2021, 11:26 PM IST

Updated : Jul 25, 2021, 6:11 AM IST

పోలీసుల ప్రొటోకాల్​.. ట్రాఫిక్​ డ్యూటీలో డాక్టర్​.. హోంమంత్రి ఫైర్​..!

హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ ట్రాఫిక్‌ పోలీసులపై హోం మంత్రి మహమూద్‌ అలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు చేసిన పనిని తెలుసుకుని.. అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ​గుట్ట బండ్లగూడ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన పోలీస్​స్టేషన్​ భవనాన్ని ప్రారంభించేందుకు హోంమంత్రి సహా.. డీజీపీ మహేందర్​రెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి వెళ్లే క్రమంలో... ప్రొటోకాల్​ కోసం మాసబ్​ట్యాంక్​ ప్రాంతంలో ట్రాఫిక్​ను​ పోలీసులు కాసేపు నిలిపేశారు. ఫ్లైఓవర్​ దగ్గరున్న సిగ్నల్​ దగ్గర వాహనాలను ఆపేయటం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్​ అయ్యింది.

ట్రాఫిక్​ను నియంత్రించిన వైద్యులు...

అదే సమయంలో అత్యవసర రోగులున్న రెండు అంబులెన్సులు ట్రాఫిక్​లో చిక్కుకున్నాయి. అంబులెన్స్​ సైరన్​ వినిపించినప్పటికీ... ట్రాఫిక్​ మధ్యలో ఇరుక్కుపోయేసరికి పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. లోపలున్న బాధితుని పరిస్థితి సీరియస్​గా ఉండటంతో... అందులో ఉన్న వైద్యులు బయటికి వచ్చి పోలీసులకు విషయం వివరించారు. ఓ వైపు ప్రొటోకాల్​... మరోవైపు ట్రాఫిక్​... ఇలాంటి పరిస్థితిలో అంబులెన్సులను ఎలా బయటికి తీసుకొస్తామనుకున్నారో ఏమో పోలీసులు.. కాసేపు ఆగాలని సూచించారు. పోలీసుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేసిన వైద్యులు... వాళ్లే స్వయంగా ట్రాఫిక్​ను నియంత్రించారు. వాళ్లకు మిగతా వాహనదారులు కూడా తోడవటంతో... ట్రాఫిక్​ నుంచి అంబులెన్సులు బయటపడ్డాయి. ఈ విషయంలో ట్రాఫిక్​ పోలీసుల తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులకే సూచనలివ్వాల్సిన పోలీసులు... వాళ్ల ప్రొటోకాల్​ కోసం ఇలా నిబంధనలకు విరుద్ధంగా... ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు.

ఈ విషయం కాస్తా... హోం మంత్రి మహమూద్​ అలీ దృష్టికి చేరటంతో పోలీసుల చర్యపై తీవ్రంగా మండిపడ్డారు. అంబులెన్స్‌ ఘటనపై ఆరా తీశారు. ఘటనపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హోంమంత్రికి వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

నూతన పోలీస్​స్టేషన్​ భవన ప్రారంభోత్సవం..

చంద్రయాన్​గుట్టలోని బండ్లగూడ ప్రాంతంలో 4 కోట్ల 21 లక్షలతో కొత్తగా నిర్మించిన పోలీస్​స్టేషన్ భవనాన్ని హోం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, ఎమ్మెల్సీ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ, హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్, తదితర ఉన్నత పోలీస్​ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 25, 2021, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.