వర్షం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని తహసీల్దార్ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించారు.
ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ మండలంలోని గౌస్నగర ప్రాంతంలో గోడ కూలి 8 మంది మరణించారు. గాజీమిల్లట్ ప్రాంతంలో గోడ కూలి ఒకరు మరణించారు. వర్షం వల్ల దాదాపు 2 వేల ఇండ్లు దెబ్బతిన్నాయని, ఇండ్లలోని సామగ్రి పాడైపోయిందని, పూర్తిగా కూలిన ఇండ్ల వివరాలు సేకరిస్తున్నామని తహసీల్దార్ ఫర్హీన్ షేక్ తెలిపారు.
వరద మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత - hyderabad news
నగరంలో వర్షం చేసిన విలయతాండవానికి బలైన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న బాధిత కుటుంబాలకు హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చెక్కులను పంపిణీ చేశారు.
వర్షం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని తహసీల్దార్ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించారు.
ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ మండలంలోని గౌస్నగర ప్రాంతంలో గోడ కూలి 8 మంది మరణించారు. గాజీమిల్లట్ ప్రాంతంలో గోడ కూలి ఒకరు మరణించారు. వర్షం వల్ల దాదాపు 2 వేల ఇండ్లు దెబ్బతిన్నాయని, ఇండ్లలోని సామగ్రి పాడైపోయిందని, పూర్తిగా కూలిన ఇండ్ల వివరాలు సేకరిస్తున్నామని తహసీల్దార్ ఫర్హీన్ షేక్ తెలిపారు.
ఇదీ చూడండి: వరద బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ