ETV Bharat / city

Holidays for schools: అక్కడ నేటి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూల్స్​ బంద్.

అక్కడ నేటి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూల్స్​ బంద్.

author img

By

Published : Jan 10, 2022, 2:23 PM IST

14:15 January 10

Holidays for schools: అక్కడ నేటి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూల్స్​ బంద్.

దేశంలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే పుదుచ్చేరిలోని పాఠశాలలను మూసివేశారు. కొవిడ్​ ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సెలవులు ప్రకటించినందున.. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని ట్వీట్​లో పేర్కొన్నారు. పుదుచ్చేరి, కరైక్కల్, మాహి, యానాంలలో 1 నుంచి 9 తరగతుల వరకూ పాఠశాలలను మూసివేస్తున్నట్లు తెలిపారు.

రోజువారీ కేసుల సంఖ్య పెరుగుదల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రైవేట్‌గా నిర్వహించబడే, ప్రభుత్వ-సహాయక సంస్థలతో సహా అన్ని పాఠశాలలు మూసివేయబడతాయని పాఠశాల విద్యా డైరెక్టర్ తెలిపారు.

ఇదీ చూడండి: 'మహా'లో 44 వేలు.. బంగాల్​లో 24 వేల కరోనా కేసులు- ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు..

For All Latest Updates

TAGGED:

schools
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.