ETV Bharat / city

అధునాతన యంత్రాలతో.. హుస్సేన్​ సాగర్​లో వ్యర్థాల తొలగింపు - తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ మహానగరానికి మణిహారం హుస్సేన్​ సాగర్. ఇక్కడ సేద తీరేందుకు నిత్యం వేలమంది ట్యాంక్​బండ్​కు వస్తుంటారు. నగరం నడిబొడ్డున ఉన్న చెరువు ఇరువైపుల ఉన్న సుందరమైన దృశ్యాలను చూస్తూ.. మైమరిచిపోతారు. అయితే.. హుస్సేన్​ సాగర్​లో చేరిన చెత్త వల్ల వచ్చే దుర్వాసన పర్యాటకులను ఇబ్బంది పెడుతోంది. ఈ విషయాన్ని గమనించిన హెచ్​ఎండీఏ హుస్సేన్​ సాగర్​లో చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ చెత్తను నిలువరించి.. జలాశయంలోకి వ్యర్థాలు రాకుండా అడ్డుకునే పనులు మొదలు పెట్టింది.

HMDA Take Action On Removing Wastage in Hussain Sagar
అధునాతన యంత్రాలతో.. హుస్సేన్​ సాగర్​లో వ్యర్థాల తొలగింపు
author img

By

Published : Oct 5, 2020, 7:25 AM IST

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా హైదరాబాద్​లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వ్యర్థాల తాకిడి తగ్గడం లేదు. ఇప్పటికే హుస్సేన్​ సాగర్​లోకి వచ్చే నాలాలు వేరే వైపు మళ్లించారు. వ్యర్థ జలాలు, చెత్త సాగర్​లో చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు ప్రత్యేక యంత్రాలతో శుభ్రం చేస్తున్నారు. అయితే.. దుర్గంధం మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితికి చెక్​ పెట్టడానికి హెచ్​ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే హుస్సేన్​ సాగర్​ సుందరీకరణ పనులు మొదలుపెట్టిన అధికారులు.. హుస్సేన్​ సాగర్​లో వ్యర్థాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు డెన్మార్క్​ నుంచి ప్రత్యేకమైన అధునాతన యంత్రాలు తెప్పించి వ్యర్థాల తొలగింపు ప్రక్రియ మొదలు పెట్టారు.

అధునాతన యంత్రాలతో.. హుస్సేన్​ సాగర్​లో వ్యర్థాల తొలగింపు

పైలట్​ ప్రాజెక్టుగా మొదలు

హుస్సేన్​ సాగర్​లో వ్యర్థాల తొలగింపు అంశమై.. ఇటీవల ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీ వేసింది. ప్రతిఏటా కోట్లు ఖర్చు చేసినా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్ల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత హుస్సేన్ సాగర్​ పరిశుభ్రతపై ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగర్​లోకి ప్రస్తుతం వస్తున్న నీటి వ్యర్థ్యాలను కట్టడి చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. హుస్సేస్ సాగర్​ పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీటివ్యర్థాలు జలాశయంలోకి చేరకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రంగంలో అనుభవమున్న డెన్మార్క్​కి చెందిన చెందిన కంపెనీ డెస్మితో హెచ్ఎండీఏ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా తొమ్మిది నెలల పాటు పైలెట్ ​ప్రాజెక్టు నిర్వహణకు డెన్మార్క్ సంస్థ అంగీకారం తెలిపింది. వచ్చే రెండు నెలల కాలంలో పైలెట్​ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను హుస్సెన్ సాగర్​లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు యంత్రాలను ట్యాంక్​బండ్​లో పరీక్షించారు.

ఫలితాన్ని బట్టి.. మరిన్ని యంత్రాలు

సికింద్రాబాద్ నుంచి వచ్చే పికెట్ ​నాలా.. కిమ్స్ హాస్పిటల్​ సమీపంలో హుస్సేస్ సాగర్​ జలాశయంలోకి ప్రవేశించే మార్గంలో ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఇందుకోసం త్వరలో డెన్మార్క్ కంపెనీ ప్రతినిధులు, వరల్డ్​ రిసోర్సెస్​ ఇనిస్టిట్యూట్ ​ఇండియా ప్రతినిధులతో కలిసి హెచ్ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో సాగర్​లోని వ్యర్థ్యాల తీవ్రతను పరిశీలించనున్నారు. డెన్మార్క్ కంపెనీ రూపొందించిన బూమ్ బారియర్ అండ్ ఆటోమేటెడ్​ రైసర్ ​సిస్టమ్ ద్వారా నీటి ద్వారా వచ్చే వ్యర్థాలను ప్రవేశ మార్గంలోనే ఎప్పటికప్పుడు ఏరివేసి కేవలం నీరు మాత్రమే సాగర్ లోకి ప్రవేశించేలా ఈ యంత్రం పనిచేస్తుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు ఆచరణ రూపం దాల్చి.. దాని ద్వారా వచ్చే ఫీడ్​బ్యాక్​తో సాగర్​లోకి నాలాలు ప్రవేశించే మరికొన్ని ప్రాంతాల్లో యంత్రాలను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ ఆలోచిస్తోంది.

ఇదీ చదవండి: జీవ ఔషధ అంకురాలకు ఆసరాగా బయో హబ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.