rajiv swagruha flats for sale : రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. బండ్లగూడలో 419 మొత్తం పూర్తికాగా.. వెయ్యి 82 ఫ్లాట్లు స్వల్పంగా పూర్తయ్యాయి. ఫినిష్‌డ్ ఫ్లాట్ల ధర చదరపు అడుగు 3 వేల రూపాయలు... సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగుకి 2 వేల 750 రూపాయలుగా నిర్ణయించారు.
- ఇదీ చదవండి : పోలీసు ఆడిన దొంగాట.. చివరకు ఉద్యోగం ఊడెనంట
పోచారంలో 13 వందల 28 పూర్తిస్థాయిలో సిద్ధమవ్వగా....142 సెమీ ఫినిష్‌డ్ ఫ్లాట్లను అమ్మనున్నారు. ఫినిష్‌డ్ ఫ్లాట్ల ధర చదరపు అడుగు 2 వేల 500.... సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగు 2 వేల 250 రూపాయలుగా నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు. రేపట్నుంచి జూన్ 14 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఉంది. మీసేవ పోర్టల్, స్వగృహ వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 22వ తేదీన ఫ్లాట్ల కేటాయింపు చేస్తారు.