స్వాతంత్య్ర సమర యోధుల సంస్థ అధ్యక్షుడు, జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ మాజీ సభ్యుడు బాబురావు వర్మ మృతి పట్ల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
బాబురావు వర్మ మృతి పట్ల.. అతని కుమారుడు బూసాని వెంకటేశ్వర్రావుతో దత్తాత్రేయ ఫోన్లో మాట్లాడారు. వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తనకు చాలా సన్నిహితులుగా ఉన్న వారిలో బాబురావు వర్మ ఒక్కరని దత్తాత్రేయ అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి బీసీల రిజర్వేషన్లపై పోరాడారని కొనియాడారు.
స్వాతంత్య్ర పోరాటం, నిజాం వ్యతిరేక ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారని గుర్తుచేసుకున్నారు. సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా బాబురావు ఉన్నారన్న దత్తాత్రేయ.. జాతీయ భావాలు నిండుగా నింపుకున్న గొప్ప వ్యక్తి కొనియాడారు.
ఇవీచూడండి: మళ్లీ అదే కథ.. చొరబాటుకు చైనా విఫలయత్నం!