ETV Bharat / city

Record: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ధాన్యం దిగుబడి

పంటల దిగుబడులు పోటెత్తాయి. గతేడాది వాతావరణం అనుకూలించడంతో పలు పంటలు రికార్డు స్థాయిలో పండాయి. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఆహారధాన్యాల దిగుబడులొచ్చాయి. పంటల దిగుబడులపై తెలంగాణ రాష్ట్ర అర్ధ, గణాంకశాఖ మూడో ముందస్తు దిగుబడుల అంచనాల నివేదికను తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. గతేడాది(2020-21) వానాకాలం(ఖరీఫ్‌), యాసంగి(రబీ) సీజన్లలో రాష్ట్రవ్యాప్తంగా సాగుచేసిన పంటల విస్తీర్ణం, దిగుబడుల లెక్కలపై మొత్తం నాలుగు సార్లు ఈశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి కేంద్రానికి పంపుతుంది. ఇందులో భాగంగా మూడో అంచనాల నివేదికను తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది.

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ధాన్యం దిగుబడి, Highest grain yield in telangana history
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ధాన్యం దిగుబడి
author img

By

Published : May 27, 2021, 7:13 AM IST

గతేడాది రెండు సీజన్లలో కలిపి రాష్ట్రంలో కోటీ 5 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా... 2.38 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దీన్ని మరపడితే 1.58 కోట్ల టన్నుల బియ్యం మార్కెట్లకు వస్తుందని అంచనా. రాష్ట్ర చరిత్రలో ఇంత అధిక దిగుబడి ఎన్నడూ రాలేదు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు నిండడం, పాత మహబూబ్‌నగర్‌ వంటి జిల్లాల్లో సైతం వరి సాగు పెరగడం వంటి కారణాలతో ధాన్యం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. యాసంగి సీజన్‌లో దేశంలోనే అత్యధికంగా 52.50 లక్షల ఎకరాల్లో వరి సాగుచేసిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రబీలోనే కోటీ 25 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా.

  • వాస్తవానికి యాసంగిలోకన్నా గతేడాది వానాకాలంలోనే ఎక్కువ విస్తీర్ణంలో 53 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. కానీ గత జులై నుంచి అక్టోబరు వరకూ కురిసిన అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడంతో ధాన్యం దిగుబడి యాసంగిలోనే ఎక్కువ వచ్చింది.
  • వరి తరవాత మొక్క.జొన్న 18.82 లక్షల టన్నులు రావడంతో ఆహార ధాన్యాల పంటల మొత్తం దిగుబడులు కోటీ 85 లక్షల టన్నులకు పైగా వచ్చాయి. వాస్తవానికి గతేడాది రెండు సీజన్లలో మొక్కజొన్నలకు ధర రాదని పంట వేయవద్దని ప్రభుత్వం రైతులకు సూచించింది. అయినా రైతులు ఈ పంట సాగుచేసి రికార్డుస్థాయిలో దిగుబడి సాధించారు.
  • ఆహారధాన్యాల దిగుబడి 185.57 లక్షల టన్నుల్లో ...177.39 లక్షల టన్నులతో వరి, మొక్కజొన్న కలిపి 95.53 శాతమున్నాయి. ఇక మిగతా జొన్న, సజ్జలు, కందులు, సెనగ, మినుము, పెసర వంటివన్నీ కలిపి మిగతా 4.47 శాతమే ఉండటం గమనార్హం.
  • రాష్ట్రంలో వరి తరవాత మరో ప్రధాన కీలకపంట పత్తి. ఈ పంట 58.27 లక్షల ఎకరాల్లో వేయగా 57.92 లక్షల టన్నులు దిగుబడి వచ్చినట్లు అంచనా. వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో పెద్దగా దిగుబడి రాలేదని భావిస్తున్నారు.
ధాన్యపు రాశులు...

ఇంకా విడుదల చేయని కేంద్రం...

అన్ని రాష్ట్రాల అర్ధ, గణాంక శాఖలు పంపిన నివేదికల ఆధారంగా కేంద్ర వ్యవసాయశాఖ సైతం ఏటా నాలుగు సార్లు దిగుబడులపై అంచనాలను విడుదల చేస్తుంది. కరోనా కారణంగా కేంద్ర కార్యాలయాల్లో సిబ్బంది సరిగా విధులకు రావడం లేదని మూడో ముందస్తు అంచనాల నివేదికను విడుదల చేయలేదు. గత మార్చిలో 2వ ముందస్తు అంచనాల నివేదికను వెల్లడించింది. దాని ప్రకారం గతేడాది దేశంలో 30.33 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు వచ్చినట్లు తెలిపింది.

ధాన్య దిగుబడి టన్నుల్లో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.