ETV Bharat / city

జీహెచ్ఎంసీ నోటీసుల తీరుపై హైకోర్టు అసహనం - ghmc news

హైదరాబాద్ శాస్త్రిపురంలో గోడౌన్‌ను మూసివేయాలని పేర్కొంటూ జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికారులు ముందుగా జీహెచ్ఎంసీ చట్టం చదువుకోవాలని వ్యాఖ్యానించింది. ఈ నెల 15న జీహెచ్ఎంసీ కమిషనర్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అస్పష్టమైన నోటీసుల వల్లే కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది.

జీహెచ్ఎంసీ నోటీసుల తీరుపై హైకోర్టు అసహ
జీహెచ్ఎంసీ నోటీసుల తీరుపై హైకోర్టు అసహ
author img

By

Published : Jun 13, 2020, 5:50 AM IST

పరిశ్రమ మూసివేతకు సంబంధించి జీహెచ్ఎంసీ​ నోటీసుల తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏమి ఉల్లంఘించారనే విషయాన్ని నోటీసుల్లో ప్రస్తావించకుంటే ఎలా అని ప్రశ్నించింది. హైదరాబాద్ శాస్త్రిపురంలో గోడౌన్‌ను మూసివేయాలని పేర్కొంటూ జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ యజమాని దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది.

వ్యర్థ పదార్థాలు వేస్తున్నారని.. కట్టెలు కాలుస్తున్నారని నోటీసులు జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిఫార్సుల మేరకు నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే సరైన కారణాలను ప్రస్తావించకుండా నోటీసు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. లైసెన్సు లేదని నోటీసు ఇచ్చారా? లేక మాస్టర్ ప్లాన్ ఉల్లంఘించారనా? పరిశ్రమ నిర్వహిస్తున్నారనా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

అధికారులు ముందుగా జీహెచ్ఎంసీ చట్టాన్ని చదువుకోవాలని వ్యాఖ్యానించింది. ఈనెల 15న జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ఇవీ చూడండి: 'వారి మృతదేహాల నిర్వహణ భయానకం, దయనీయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.