ఆంధ్రపదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. పరీక్షా ఫలితాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ విషయమై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఫలితాల కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక విద్యాబోధన ప్రాజెక్టు, విద్యా కానుక అమలు అంశాలపైనా సమావేశంలో మంత్రి సురేశ్ చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం క్యాలెండర్ తయారీ, పాఠశాలలు తెరిచే అంశంపైనా ప్రధానంగా చర్చ జరిగింది. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రాథమిక విద్యాబోధన, విద్యాకానుక అమలు కార్యచరణపై మంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడారు.
ఇదీ చదవండి: offline classes: ప్రత్యక్ష తరగతులు వాయిదా..సీఎం కేసీఆర్ నిర్ణయం